Ambulance : కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి అంబులెన్స్‌లో బయలు దేరిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Ambulance : ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు కరోనా రోగులను తెలంగాణ పోలీసులు రెండోరోజైన మంగళవారం అనుమతించడం లేదు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు దాటిన తర్వాత ఏపీ – తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కోవిడ్ రోగులతో వచ్చే అంబులెన్సులను నిలిపివేస్తున్నారు. ఆస్పత్రులు పంపిన అనుమతి పత్రాలు చూపించినా పోలీసులు అంగీకరించడం లేదు. హైదరాబాద్‌లోని ఉన్న ఆస్పత్రుల ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తే తప్ప తెలంగాణలోకి ప్రవేశం లేదని తేల్చి చెబుతున్నారు. అలా ఫోన్లు వచ్చిన వారినే అనుమతిస్తున్నారు. దీంతో గంటల తరబడి రోడ్లపైనే రోగులు, బంధువులు పడిగాపులు కాస్తున్నారు. కోవిడ్ రోగులకు ఏమైనా జరిగితే తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగులను రక్షించాలని వేడుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రా నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పు బట్టింది. ఏ అధికారంతో అంబులెన్స్‌లను ఆపారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. పోలీసు కమిషనర్లు, జీమెచ్ఎంసీ కమిషనర్ విచారణకు హాజరయ్యారు. కాగా రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడంపై హైకోర్టు తీవ్ర ఆగహం వ్యక్తం చేసింది. విపత్తు వేళ అంబులెన్స్‌లు నిలిపివేయడం మానవత్వమా? రాత్రి కర్ఫ్యూ అమలు సరిగా లేదు. మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించట్లేదు? రంజాన్ తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారనా? అంటూ కోర్టు ఆదేశాలు, సూచనలు బుట్టదాఖలు చేయడం బాధాకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!