Telangana లో Summer Holidays ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌

0
36
views

Telangana లో Summer Holidays ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌

Summer Holidays : తెలంగాణా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల‌కు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్‌ 27 నుంచి మే నెల 31వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.స‌బితా ఇందారెడ్డి వెల్ల‌డించారు. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాలల‌కు సంబంధించి వేస‌వి సెల‌వుల నిర్ణ‌యం పై సీఎం కేసీఆర్, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, విద్యాశాఖ అధికారుల‌తో ఆదివారం ఉద‌యం స‌మీక్షించార‌ని తెలిపారు. క‌రోనా విస్త‌రించిన నేప‌థ్యంలో సీఎం ఆదేశాల‌కు అనుగుణంగా ఇప్ప‌టికే 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి 5,21,392 మంది విద్యార్థుల‌ను పాస్ చేసిన‌ట్టు మంత్రి గుర్తు చేశారు. అదే విధంగా 1 నుంచి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న 53 ల‌క్ష‌ల 79 వేల 388 మంది విద్యార్థ‌ల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేసిన‌ట్టు మంత్రి తెలిపారు. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌ల‌ను త‌ర్వాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ 19 ప‌రిస్థితిని అనుస‌రించి జూన్ 1న ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంద‌ని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీన ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రం చివ‌రి దినంగా ప‌రిగ‌ణిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

Share Link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here