Provident Fund : పుట్టిన తేదీకి కార్మికుల PF కు లింక్ పెడ‌తారా?

Spread the love

Provident Fund : పుట్టిన తేదీకి కార్మికుల PF కు లింక్ పెడ‌తారా?

ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు : మున్సిప‌ల్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు

Provident Fund : మున్సిప‌ల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బంది భ‌విష్య‌నిధిలో ఏప్రిల్ నెల నుండి ఆధార్‌, పిఎఫ్(PF) ఖాతాల్లో ఒకేలా పుట్టిన తేదీ లేకుంటే సొమ్ము చెల్లింపులు జ‌ర‌గ‌వు అన‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని, ప్ర‌భుత్వం ఇటువంటి ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ – ఔట్ సోర్సింగ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ (ఏఐటియూసీ) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ఏఐటియూసీ మున్సిప‌ల్ కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ఖ‌మ్మం జిల్లా అసిస్టెంట్ పిఎఫ్ క‌మిష‌న‌ర్ మాధ‌వ శంక‌ర్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

అనంత‌రం మందా వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ అస‌లే చ‌దువు రాని నిర‌క్ష్యరాసులు మున్సిప‌ల్ రంగంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ త‌దిత‌ర ప‌ద్ధ‌తుల్లో చాలీచాల‌ని జీతాల‌తో వెట్టి చాకిరితో ప‌నిచేస్తున్నార‌ని వారి పేర్లు పిఎఫ్ ఖాతాల్లో న‌మోదు చేసేట‌ప్పుడు మున్సిప‌ల్ సిబ్బంది కార్మికుల వ‌య‌స్సును ఉదాహ‌ర‌ణ‌గా పెట్టి తేదీ వివ‌రాలు పొందుప‌రిచార‌న్నారు. కార్మికుల పిఎఫ్(Provident Fund) ఖాతాల్లో చేరేట‌ప్పుడు ఆధార్ వ్య‌వ‌స్థ లేద‌ని, కార్మికుల‌కు పిఎఫ్ వ్య‌వ‌స్థ 2011 నుండి అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని తెలిపారు. కానీ ఆధార్ విధానం 2015వ సంవ‌త్స‌రంలో వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. అప్ప‌టి కార్మిక సిబ్బందికి ఈ విష‌యం తెలియ‌క ఆధార్‌ను అంచ‌నాగా పుట్టిన తేదీ వివ‌రాలు న‌మోదు చేయించుకున్నార‌ని పేర్కొన్నారు.

విన‌తి ప‌త్రం ఇస్తున్న మందా వెంక‌టేశ్వ‌ర్లు

లేనిపోని ఆంక్ష‌లు పెట్టొద్దు: మందా

అలాంటి ప‌రిస్థితుల్లో ఇప్పుడు ప్ర‌భుత్వం లేనిపోని ఆంక్ష‌లు విధించి మున్సిప‌ల్ ఉద్యోగ‌, కార్మిక సిబ్బంది భ‌విష్య‌త్తులో జీవితానికి ఆస‌రాగా ఉంటుంద‌ని భ‌విష్య‌నిధి పిఎఫ్ లో కొంత సొమ్ము జ‌మ చేసుకున్న సొమ్మును రానివ్వ‌కుండా అడ్డంకులు పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు. సొమ్ము జ‌మ చేసుకునేట‌ప్పుడు ఎటువంటి ఆంక్ష‌లు లేవ‌ని, ఇప్పుడు స‌వాల‌క్ష కార‌ణాలు చూపుతూ ఆధారాలు అడిగితే ఇప్పుడు కార్మికులు ఎక్క‌డ నుండి తెస్తార‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగ కార్మిక సిబ్బంది అనివార్యంగా అవ‌స‌ర‌మొచ్చి త‌మ ఖాతాల్లో సొమ్ము తీసుకోవాల‌నుకుంటే పుట్టిన తేదీ ఆధారాలు అడ‌గ‌డం స‌బ‌బు కాద‌ని సూచించారు. ప్ర‌భుత్వం ఇటువంటి ప‌నికిమాలిన ష‌ర‌తులు పెట్ట‌కుండా సొమ్ము చెల్లింపులు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే మున్సిప‌ల్ ఉద్యోగ కార్మిక సిబ్బంది పీఎఫ్ స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఏఐటియూసీ మున్సిప‌ల్ కార్మిక సంఘం నాయ‌కులు బి.పాపారావు, కె.తిర‌ప‌య్య‌, జి.శ్రీ‌నివాస్‌, సిహెచ్ తిర‌ప‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Chalo Khammam Collectorate: క‌నీస వేత‌నాల పెంపుద‌ల‌కై ఖ‌మ్మం కార్మిక సంఘాల నేత‌లు ఉక్కుపాదం!

Chalo Khammam Collectorate: ఖ‌మ్మం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, గార్డెన్, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్స్ Read more

AITUC Trade Union : రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

అవ‌స‌రం తీరాక కార్మికుల‌ను తొల‌గిస్తారా?అక్ర‌మంగా తొల‌గించిన వారిని విధుల్లోకి తీసుకోవాలిరాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు యేసుర‌త్నం, మందా వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ AITUC Trade Union : Hyderabad: మున్సిప‌ల్ Read more

Bhagat Singh Life Story : నేడు ఢిల్లీ రైతుల పోరు.. నాడు భ‌గ‌త్ సింగ్ స్మూర్తి దాయ‌క‌మే!

Bhagat Singh Life Story : విప్లవ వీర యోధుడి ఉరికి 90 ఏళ్లు, మ‌రో ప‌దేళ్ల‌లో నూరేళ్లు ఐనా వీరుడు నిత్యం చెద‌ర‌ని రూపం, స‌దా Read more

DHPS : ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు న‌మోదు చేయాలి

డిహెచ్‌పిఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు DHPS : Khammam: ద‌ళితుల, గిరిజ‌నుల‌, బీసి ల ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచే విధంగా ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మాట్లాడిన వ్యాఖ్య‌లు Read more

Leave a Comment

Your email address will not be published.