weather: రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. బంగాళా ఖాతంలో ఆంధ్రా, ఒడిశా తీరం వద్ద ఆదివారం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. అల్పపీడ నానికి అనుబంధంగా ఏర్పడిన ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే ఆదిలాబాద్, కుమ్రం – భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, సిద్ధిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్ధి పేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!