Raj News: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో Raj News పబ్లిక్ డిబేట్‌పై ఆదివారం దాడి జరిగింది. ఒకేసారి వేదికపైకి వందల మంది వ్యక్తులు దూసుకొచ్చినట్టు యాజమాన్యం చెబుతోంది. కార్యకర్తలను పంపి ఎమ్మెల్యే సైదిరెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని టీవీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దాడి చేయించారని తెలుపుతున్నారు.
స్టేజీపైకి ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు ఒక్కసారిగా దూసుకువచ్చి డిబేట్ జరగకుండా అడ్డుకున్నారని, లైవ్ వైర్లను కార్యకర్తలు తెంపారని అన్నారు. అదే విధంగా రాజ్ న్యూస్ కెమెరా మెన్లపై ఎమ్మెల్యే అను చరులు దాడి చేయించారని హుజూర్నగర్ నుంచి వెళ్లిపోవాలంటూ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాజ్ న్యూస్ లైవ్ ఎక్విప్మెంట్, కారులను ధ్వంసం చేశారని, కుర్చీలను, ఎల్ఈడీలను కింద పడేశారని అన్నారు. సిబ్బంది ఫోన్లు, మైకులు లాక్కున్నారని తెలిపారు. బయటికి వస్తే అంతు చూస్తామంటూ ఎమ్మె ల్యే అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులను భద్రత కోరినా స్పందించలేదని రాజ్ న్యూస్ సిబ్బంది చెబుతున్నారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!