The Pregnant Woman is worried that the unborn baby has disappeared | గ‌ర్భంలోని శిశువు మాయమైదంటూ మ‌హిళ ఆందోళ‌న‌

Spread the love

The Pregnant Woman is worried that the unborn baby has disappeared | గ‌ర్భంలోని శిశువు మాయమైదంటూ మ‌హిళ ఆందోళ‌న‌Tirupathi: తిరుప‌తి ప్ర‌సూతి ఆసుప‌త్రిలో ఓ మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల‌తో తీవ్ర ‌క‌ల‌క‌లం రేగింది. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం పోలీసుస్టేష‌న్ కు చేరింది. తిరుప‌తిలోని ప్ర‌భుత్వ ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో ఓ మ‌హిళ త‌న గ‌ర్భంలోని శిశువును మాయం చేశారంటూ గొడ‌వ‌కు దిగింది. డాక్ట‌ర్ల‌పై స‌ద‌రు మ‌హిళ తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం తిరుప‌తి ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. స్థానికులు, డాక్ట‌ర్లు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన శ‌శిక‌ల అనే మ‌హిళ ఇటీవ‌ల తిరుప‌తి లో ప్ర‌భుత్వ ప్ర‌సూతి ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ప‌లుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం మ‌రోసారి ఆమె ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఈ సారి మాత్రం వింత వాద‌న‌తో ఆస్ప‌త్రి సిబ్బందిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

The Pregnant Woman

పోలీసుస్టేష‌న్‌కు చేరిన పంచాయ‌తీ!

బిడ్డ కాన్పు కోసం వ‌చ్చిన త‌న‌కు అస‌లు గ‌ర్భ‌మే రాలేద‌ని అంటున్నార‌ని ఆస్ప‌త్రి నిర్వాహ‌కుల‌తో ఆమె వాగ్వాదానికి దిగారు. గ‌ర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డాక్ట‌ర్లు తీరును త‌ప్పుప‌డుతూ ఆస్ప‌త్రి ముందే నిర‌స‌న వ్య‌క్తం చేశారు.
మ‌హిళ ఆరోప‌ణ‌పై ఆస్ప‌త్రి వైద్యాధికారులు షాక్‌కు గుర‌య్యారు. మ‌హిళ తీరుపై ప్ర‌సూతి ఆస్ప‌త్రి వైద్యులు అలిపిరి పోలీసుస్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌ను బ‌య‌ట‌పెట్టారు. శ‌శిక‌ళ క‌డుపులో ఉన్న గాలి బుడ‌గ‌ల‌ను గ‌ర్భంగా భావించ‌ద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వైద్యుల ఫిర్యాదు మేర‌కు ఆస్ప‌త్రికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే స‌ద‌రు మ‌హిళ మాన‌సిక ప‌రిస్థితిపై కూడా వివ‌రాల‌ను సేక‌రిస్తారు.

ఇది చ‌ద‌వండి:ప్ర‌ముఖ నిర్మాత దొర‌స్వామి రాజు ఇక లేరు

ఇది చ‌ద‌వండి:ఇక ఫుల్ డే త‌ర‌గ‌తులు..వేస‌వి సెల‌వులు ర‌ద్దు!

ఇది చ‌ద‌వండి:న‌గ‌రానికి ప‌య‌నం..హైవేపై భారీ ట్రాఫిక్ జామ్‌!

AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani | తిట్ల మీద ఉన్న ప‌ట్టు శాఖ‌పై లేదు: అచ్చె‌న్నాయుడు

AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani Amaravathi: రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి కొడాలి నానిపై టిడిపి రాష్ట్ర అధ్య‌క్షులు, Read more

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet | స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు..బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లం కాదు!

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet తిరుప‌తి ప్రెస్‌మీట్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ Tirupathi : జ‌న‌సేన Read more

Tirupathi news today | Ram Nath kovind: 24న తిరుమ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి రాక‌

Tirupathi news today | Ram Nath kovind: 24న తిరుమ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి రాక‌ తిరుప‌తి : భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 24న Read more

Tiruvuru Murder Case: తిరువూరు బ‌స్టాండ్‌లో యువ‌కుడి దారుణ హ‌త్య‌

Tiruvuru Murder Case: కృష్ణా జిల్లా తిరువూరు ప‌ట్ట‌ణంలోని ఓ హ‌త్య సంచ‌ల‌నం సృష్టించింది. ఎన్న‌డూ లేని విధంగా తిరువూరు ప‌ట్ట‌ణంలో మ‌ర్డ‌ర్ వెలుగు చూడ‌టంతో స్థానిక Read more

Leave a Comment

Your email address will not be published.