Deep Well : ప్రమాదవశాత్తు కాలు జారి ఓ వృద్ధురాలు లోతైన బావిలో పడిపోయింది. బావిలో ఉన్న పైను ఆధారంగా చేసుకుని కేకలు వేయడం ఆరంభించింది. పోలీసులు సమాచారం అందుకొని క్షేమంగా వృద్ధురాలిని బయటకు తీశారు.
Deep Well : తిరుపతి అర్బన్ జిల్లా రేణిగుంట పోలీస్టేషన్ పరిధిలో అత్తురు గ్రామానికి చెందిన సుబ్బమ్మ వయసు 80 సంవత్సరాలు. కాల కృత్యాలు కోసం ఊరి చివరిలో ఉన్న పొలం వద్దకు పోతున్న క్రమంలో పొరపాటును కాలు జారి వ్యవసాయ బావిలో సుమారు 5 గంటలప్రాంతంలో పడిపోయింది. సుమారు 5 గంటల పాటు నీటిలోనే పైపుని పట్టుకుని ఉండటంతో అటుగా వెళుతున్న వారు ఆమె కేకలను గమనించి గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం.శ్రీనివాసులుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై సిబ్బందికి ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది శివ కుమార్, మహేష్ లు పరిస్థితిని గమనించారు. ఆ బావికి ఎలాంటి మెట్లు గానీ, పైకి వచ్చే ఆధారం గానీ లేదు. ఈ పరిస్థితిని అవగాహన చేసుకున్న సిబ్బంది స్థానికంగా ఒక మంచాన్ని తెప్పించుకుని ఆ మంచం సహాయంతో సమయస్ఫూర్తిగా ఆమెకు ధైర్యాన్ని చెబుతూ సురక్షితంగా విజయవంతంగా కాపాడి పైకి తీసుకొచ్చి అక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో వృద్ధురాలిని కాపాడిన గాజులమండ్యం పోలీస్ సిబ్బందికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!