khammam Municipal Election 2021: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రచారానికి రెఢీ!
khammam Municipal Election 2021: ఖమ్మం నగర కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల జాతర ఆదివారంతో ముగిసింది. ఈ నెల 30 తేదీన జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఆదివారం నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పెద్ద ఎత్తున జనసమూహంతో బయలు దేరి వెళ్లారు. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం,సిపిఐ, బీజేపీ – జనసేన ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.


టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో..
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 22వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్లా రోస్లీనా బరిలో ఉన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో ఆదివారం 22వ డివిజన్ అభ్యర్థిగా పల్లా రోస్లీనా పోటీ చేసే డివిజన్ లో అన్ని ప్రాంతాల మీదుగా భారీ ర్యాలీ ప్రదర్శనతో డీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమలో జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్, కోటయ్య రాజు, అమరగానీ వెంకటేశ్వర్లు, షకీనా, ఝాన్సీ, పల్లా లెనిన్ తదితరులు పాల్గొన్నారు.


టిఆర్ఎస్ పార్టీ 25వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా గోళ్ల చంద్రకళ ఆదివారం భారీ ప్రదర్శన మధ్య నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 1000 మంది పార్టీ కార్యకర్తలతో డీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోళ్ల వెంకటేశ్వర్లు, డివిజన్ నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.


టిఆర్ఎస్ 6వ డివిజన్ అభ్యర్థిగా పసుమర్తి రామ్మోహన్ రావు ఆదివారం నామినేషన్ దాఖలు చేవారు. భారీ ప్రదర్శన మధ్య గాంధీచౌక్ లోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని అనంతరం చాకలి బజార్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. గాంధీచౌక్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జి ఆర్జేసీ కృష్ణ ఆధ్వర్యంలో 400 మంది పార్టీ కార్యకర్తలతో డిఆర్డీఏ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. కార్యక్రమంలో కొప్పు నరేశ్, చిన్ని కృష్ణారావు, కొత్త వెంకటేశ్వరరావు, పిల్లుట్ల కృష్ణ, కాకరపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


సిపిఎం ఆధ్వర్యంలో…
ఖమ్మం నగర కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గతంలో ఖమ్మం మున్సిపల్ చరిత్రంలో సిపిఎం పాలన ఉంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కూడా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే రీతిలో పోటీలో దిగింది. ముఖ్యంగా టిఆర్ఎస్ పాలనలో అంతా అవినీతే జరిగిందని, ప్రజల సమస్యలు పట్టించుకోలేదనే విధంగా ఖమ్మం నగర ప్రజల్లో ప్రచారం తీసుకెళ్లనుంది. ఆదివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 40,42 డివిజన్లలో సిపిఎం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 40వ డివిజన్ అభ్యర్థిగా నందిపాటి మనోహర్, 42వ డివిజన్ అభ్యర్థిగా నందిపాటి పావని పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 30 డివిజన్లలో అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు.


ఖమ్మం అర్బన్ – 1, 2, 14, 15, 60
హవేలీ – 5,6,7, 53
ఖమ్మం 1టౌన్ – 23, 25, 37, 40, 42
ఖమ్మం 2టౌన్ – 43, 44, 50, 52
ఖమ్మం 3టౌన్ – 17, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 48.


కాంగ్రెస్ ఆధ్వర్యంలో..


ఖమ్మం నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బెజ్జం బాలగంగాధర్ నామినేషన్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత డివిజన్లలోని ప్రాంతాలు తిరిగి అనంతరం బైక్ ర్యాలీతో మున్సిపాలిటీ వరకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, యూత్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జనసేన – బీజేపీ పొత్తు ఆధ్వర్యంలో ..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన- బిజెపి పొత్తులో 12 డివిజన్లలో నామినేషన్లు వేశారు. పొత్తులో భాగంగా 10 డివిజన్లు జనసేనా పార్టీ, 2 డివిజన్లు బీజేపీ పార్టీ పోటీ చేసేవిధంగా రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆదివారం నామినేషన్ చివరి రోజు కావడంతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు, జిల్లా ఇంఛార్జి రామ్ తాళ్లూరి దగ్గరుండి మరీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. ముస్తఫా నగర్ నుంచి ర్యాలీగా బయలు దేరి ప్రకాశ్ నగర్, గాంధీచౌక్, సారధి నగర్, ఎఫ్సీఐ, బైపాస్ రోడ్ మీదుగా డీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.


జనసేన అభ్యర్థులు వీరే..
- మిరియాల జగన్ (23వ డివిజన్)
- ధనిశెట్టి భానుమతి (48వ డివిజన్)
- గరదాసు సుమలత (47వ డివిజన్)
- బోగా హరిప్రియ (28వ డివిజన్ )
- ఏ – బండారు రామకృష్ణ (16వ డివిజన్)
బి- నల్లగట్ల శ్రీనివాసరావు (16వ డివిజన్) - బోడా వినోద్ (8వ డివిజన్)
- గుండా పవన్ కళ్యాణ్ (60వ డివిజన్)
- సింగారపు చంద్రమౌళి (51వ డివిజన్)
- తూము ఉమా మహేశ్ (2వ డివిజన్)
- యాసా మురళి కృష్ణ (13వ డివిజన్)
- మైలవరపు మణికంఠ (36వ డివిజన్)
- యాసంనేని అజయ్ కృష్ణ (14వ డివిజన్ ).
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో..
ఖమ్మం నగర కార్పొరేషన్ ఎన్నికల్లో బహుజన సమాజ్ వాద్ పార్టీ పోటీ చేస్తుంది. నాలుగు డివిజన్లలో తమ అభ్యర్థులను నామినేషన్లు వేపించినట్టు పార్లమెంట్ కో- ఆర్డినేటర్ మట్టే గురుమూర్తి తెలిపారు. 15వ డివిజన్ అభ్యర్థిగా కర్రి లక్ష్మీ, 41వ డివిజన్ అభ్యర్థిగా కుక్కల కృష్ణ, 58వ డివిజన్ అభ్యర్థిగా బత్తుల పద్మ, 60 డివిజన్ అభ్యర్థిగా అన్నెపోగు ఉపేందర్ నామినేషన్లు దాఖలు చేశారు.


స్వతంత్ర అభ్యర్థిగా వెంకన్న నామినేషన్
వివిధ కుల, ప్రజా సంఘాలు, తెలంగాణ జన విజ్ఞాన వేదిక బలపరిచిన స్వతంత్య్ర అభ్యర్థి కోయిన్ని వెంకన్న 50 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు డాక్టర్ కెవి. కృష్ణారావు, బాణోతు బద్రూ నాయక్, గుంతేటి వీరభద్రం, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.


52వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా మధు!
ఖమ్మం నగర పాలక సంస్థలోని 52వ డివిజన్ లో తూమాటి మధు స్వతంత్ర అభ్యర్థిగా తూమాటి మధు పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎలక్షన్లో 2014 – 2018 ఎన్నికల్లో పోటీ చేసినట్టు తెలిపారు. అప్పుడు తనకు 500 పై చిలుకు ఓట్లు వేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 52వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానని తన యందు నమ్మకం ఉంచి ఒక్క అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started