New Bride Murder : నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
New Bride Murder : నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
Khammam: తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం మండలం అయ్యవారి గూడెంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన నవవధువు నవ్య రెడ్డి(22) చివరికి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గుట్టమీద శవమై కనిపించింది. అయితే నవ్యరెడ్డిని భర్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన ఎర్రమల నవ్యవరెడ్డి అనే 22 ఏళ్ల వివాహితను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామ శివారులోని కుక్కల గుట్ట వద్ద ఆమె భర్త నాగశేషు రెడ్డి చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. రెండు రోజుల క్రితం ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో నవ్యరెడ్డి భర్త నాగశేషు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
New Bride Murder : భర్త కదలికలపైనే అనుమానం!
ఈ దర్యాప్తులో భర్త నాగశేషు రెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా మృతురాలు నవ్యరెడ్డి భర్త నాగశేషు రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
బుధవారం రాత్రి సమయంలో నవ్యరెడ్డిని బైక్పై తీసుకువచ్చి కుక్కలగుట్ట వద్ద మత్తు టాబ్లెట్ లు ఇచ్చి అనంతరం చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్ఫోన్ నుండి నిందితుడు శేషురెడ్డి ఆమె తండ్రికి మెస్సేజ్ చేశాడు. ఇంజనీరింగ్ లో బ్యాక్ లాక్ క్లాస్లు ఉన్నాయని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి సెల్ఫోన్ నుండి మెస్సేజ్ లు పంపించాడు. అనంతరం ఎర్రుపాలెం పోలీసు స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
నిందితుడు నాగ శేషు రెడ్డి పూనేలో ఉద్యోగం చేస్తుంటాడు. మృతురాలికి స్వయానా మేనమామ కొడుకు నాగశేషు రెడ్డి. రెండు నెలల క్రితమే వీరికి వివాహం అయ్యింది. మృతురాలు సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది.
ఇది చదవండి:టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికల్లో జనసేనాకు టిడిపి మద్దతు!
ఇది చదవండి: ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఇది చదవండి:గుంటూరు జిల్లా కలెక్టర్గా Vivek Yadav బాధ్యతలు స్వీకరణ
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
ఇది చదవండి: 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక
ఇది చదవండి:యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పోస్టులను భర్తీ చేయాండి: గవర్నర్
ఇది చదవండి:తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
ఇది చదవండి:నందిగామ నియోజకవర్గంలో టిడిపి ఖాతాలోకి గోకరాజుపల్లి