The joe Washington: ప్రపంచంలోనే అగ్రదేశం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ఉపాధ్యక్షురాలుగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ప్రమాణస్వీకారం చేశారు. తొలుత జో బైడెన్ తన కుటుంబానికి చెందిన పురాతన బైబిల్ గ్రంథం మీద ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం జరిగిన సభలో అమెరికా 46వ అధ్యక్షులు జో బైడెన్(The joe) ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మొదటి ప్రసంగం చేశారు. ఎన్నో సవాళ్ల నుంచి మనం ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామని అన్నారు. ఈ విజయం నాది కాదని, ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా ఓడిపోకుండా, వెనుదిరగకుండా ఎదురుచూశామని పేర్కొన్నారు. మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉందని తెలియజేశారు. హింస, ఉగ్రవాదం, నిరుద్యోగ సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అమెరికా ఇప్పటికే ఎన్నో అవరోధాలను చూసిందని, ప్రపంచ యుద్దాలను చవిచూసిందని అన్నారు. అమెరికన్లతో పాటు దేశంలో ఉన్న ప్రతిఒక్కరీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో ప్రతిఒక్కరి సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. వివక్షకు ఈ దేశంలో స్థానం లేదని తెలియజేశారు. అమెరికా ప్రపంచయుద్దాలను, ఆర్థిక సంకోభాలను ఎదుర్కొన్నదని, ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి అమెరికాకు ఉందని పేర్కొన్నారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రఖ్యాత సింగర్ జెన్నిఫర్ లోపెజ్ జాతీయగీతాన్ని ఆలపించారు. ప్రమాణ స్వీకారోత్సవం వాషింగ్టన్లో నేషనల్మాల్ వద్ద అత్యంత భద్రత నడుమ జరిగింది. 25 వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 1,070 మంది అతిథిలు హాజరయ్యారు. ప్రత్యేక అతిథిలుగా ఆ దేశ మాజీ అధ్యక్షులు క్లిటన్, బుష్, ఒబామా హాజరయ్యారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. భారత్ సంతతికి చెందిన కమలా హారిస్ ఆ దేశ మొట్టమొదటి ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడంతో చరిత్రను సృష్టించారు.
ఇది చదవండి : ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మహత్య
ఇది చదవండి : అత్యంత దారుణంగా యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది