urinary incontinence: రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుందని పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకుంటారు? కానీ మధ్య వయస్కులకీ, వయస్స పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్ళు తాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్ర విసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా!.
urinary incontinence: రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది?
మీరు నిటారుగా నిలబడినప్పుడు సాధారణంగా కాళ్ళలో వాపు వస్తుంది(ముఖ్యంగా మధ్య వయస్సులో ఉన్నవారికి వయస్స పైబడిన వారికి). ఎందుకంటే గురుత్వాకర్షణ వల్ల మీ క్రింది భాగాలలో ముఖ్యంగా కాళ్లలో ఎక్కవ నీళ్ళు ఉంటాయి.
అదే మీరు పడుకుంటే మీ దిగువ శరీరం (ట్రంక్, కాళ్ళు మొదలగునవి) మీ మూత్రపిండాలతో సమంగా ఒకే ఎత్తులో ఉంటుంది కనుక, మూత్ర పిండాలు ఎక్కువ నీటిని తొలగించేదానికి సులభంగా ఉంటుంది.
మూత్రం ద్వారానే మన రక్తంలోని మలినాలు, విష పదార్థాలు విసర్జింపబడతాయి.
అటువంటప్పుడు నీళ్ళు త్రాగడానికి సరైన సమయం ఏమిటి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్య సూత్రాలు!
- ఉదయం మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడం – అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయ పడుతుంది.
- భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – జీర్ణక్రియకు సహాయ పడుతుంది.
- స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది.
- రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడం – స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు.
- అదనంగా రాత్రి మధ్యలో నీరు త్రాగడం రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయ పడుతుంది.
- కాలు కండరాలు సంకోచించడం (కొంకర్లు ) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగం మన శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు వస్తుంది. రోజంతా సరిగా నీళ్ళు తాగడం వల్ల ఈ రోగం రాదు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి