great depression food

great depression food: బ‌ల‌వ‌ర్థ‌క ఆహార‌మే డిప్రెష‌న్‌కు అస‌లైన మందు

Health News

great depression food మాన‌సిక స్థితికి మూలం మ‌న ఆలోచ‌న‌లు, మ‌న భావోద్వేగాలే కార‌ణ‌మ‌నుకుంటాం. వాస్త‌వానికి అస‌లు మూలం మ‌నం తీసుకునే ఆహార‌మేన‌ని నేవ‌ర్రా యూనివ‌ర్శిటీకి చెందిన ప్రొఫెస‌ర్ ఆల్మ‌డెనా విల్లేగాస్ బృందం జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో బ‌య‌ట‌ప‌డింది. దృఢ‌మైన శ‌రీరంలోనే ధృడ‌మైన మన‌సు ఉంటుంద‌నే ఒక సాధార‌ణ నానుడి అంత‌కు ముందునుంచే ఉన్నా, ఆ విష‌యం మ‌రింత లోతుగా, స్ప‌ష్టంగా అన్నింటినీ మించి శాస్త్రీయ‌మైన ఆధారాల‌తో ఆ విష‌యం బ‌య‌ట(great depression food) ప‌డింది.

ఆహార ప్రభావం కీల‌కం!

మాన‌సిక స్థితిని ప్ర‌భావితం చేయ‌డంలో ప్ర‌త్యేకించి తీవ్ర‌మైన కుంగుబాటు (డిప్రెష‌న్‌) తో ఉన్న‌వారి మీద ఆహార ప్రభావం ఎలా ఉంటుందో ఈ స్పానిష్ ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డి చేశాయి. ఆహారంలో ఉండే ఫాట్స్‌, ఆలివ నూనె లాంటి మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ సెర‌టోనిన్ అనే న్యూరోట్రాన్స్‌మిట‌ర్ హార్మోను ఉత్ప‌త్తి చేయ‌డంలో కీల‌క పాత్రను పోషిస్తున్న‌ట్టు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. నాడీ క‌ణాల‌ను, మెద‌డులోని రిసెప్టార్ల మ‌ధ్య బంధాన్ని కుదుర్చ‌డంలో సెర‌టోనిన్ హార్మోన్ బాగా తోడ్పడుతుంది. అంతే కాదు మూడ్‌ను, కోపాన్ని, ఉద్రేకాన్ని, కొన్ని గ్రాహక ప్ర‌క్రియ‌ల్ని, చివ‌రికి ఆక‌లిని క్ర‌మ‌బ‌ద్ధం చేయ‌డ‌లో సెర‌టోనిన్ భాగా తోడ్ప‌డుతుంది. సెర‌టోనిన్ హార్మోన్ కొన్నిసార్లు మెల‌టోనిన్‌గా మారుతుంది. ఇది మంచి నిద్ర రావ‌డానికి దోహదం చేస్తుంది. మంచి యాంటీ డిప్రెసెంట్‌గా కూడా బాగా ప‌నిచేస్తుంది.

న‌రాల దృఢం కోసం!

న‌రాల లోప‌లి పొర కొవ్వు ప‌దార్థాల‌తో నిర్మిత‌మై ఉంటుంది. అందువ‌ల్ల మ‌నం తీసుకునే కొవ్వు పదార్థాల నాణ్య‌త క‌చ్చితంగా ఆ న‌రాల పొర‌ను దృఢ‌ప‌రుస్తుంది. శ‌రీర వ్య‌వ‌స్థ‌, న్యూరో ట్రాన్స్‌మీట‌ర్ల వ్య‌వ‌స్థ మ‌నం తీసుకునే విట‌మిన్ల మీదే ఎక్కువుగా ఆధార ప‌డి ఉంటుంది. విట‌మిన్ బి-6, ఫోలిక్ యాసిడ్ డిప్రెష‌న్కు విరుగుడుగా జీవ‌న‌క్రియ‌ల్ని ఉత్తేజితం చేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.

బ‌ల‌వ‌ర్థ‌క‌ ఆహారం ర‌క్త‌నాళాల ప‌నితీరును పెంచుతుంది. వాటిలో వాపుల‌కు అవ‌కాశం లేకుండా చేసి గుండె జ‌బ్బుల‌ను నిరోధిస్తుంది. ఆక్సీజ‌న్ సంబంధిత కార‌ణాల‌తో క‌ణ విధ్వంసం జ‌ర‌గ‌కుండా చేయ‌డం వ‌ల్ల డిప్రెష‌న్‌కు తావు లేకుండా పోతుంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *