Flyover Accident : ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి కూలడంతో ఇద్దరు కారులోనే మృతి చెందారు. ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Flyover Accident : విశాఖపట్నం : అనకాపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కింద ఉన్న వాహనాలపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. వంతెన కూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వంతెన పెద్ద శబ్ధంతో ఒక్కసారికూ కుప్పకూలడంతో జనాలు తీవ్ర భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి, ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు ప్రారంభించారు. వంతెన కింద మరికొందరు చిక్కుకున్నారేమోనని స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలి వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. హైవే విస్తరణలో భాగంగా ఇక్కడ భారీ వంతెన నిర్మాణం జరుగుతోంది. రెండేళ్ల నుంచి ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాధితులు నూకాలమ్మ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.


వంతెన పిల్లర్ కారుపై పడటంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్నది ఇద్దరా? ముగ్గురా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చీకటి పడటంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది. ప్రమాద ఘటనతో అనకాపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వంతెన సైడ్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో వంతెన నిర్మాణంలో నాణ్యతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణంలో లోపాలే ఈ ప్రమాదానికి కారణమా అన్నది తెలియాల్సి ఉంది.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!