The Drama of display : karnataka: మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి అంటారు కదా! అదేవిధంగా ఆ కళా పోషణ కాస్త ఎక్కువై ఒక నాటకంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేంత పనిచేశాడు. నాటకంలో పాత్రకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తే చాలు 100 కు 100 మార్కులు పడినట్టే అని అనుకునేవారు కొందరైతే, పాత్రలో నటించడమే కాదు, ఏకంగా జీవించవచ్చని నిరూపించాడు ఓ కళాకారుడు. ఆ పాత్రలో లీనమై ఫైనల్గా మరొక వ్యక్తికి చంపబోయాడు. అదృష్టం కొద్ది అతను తప్పించుకొని బతికాడు.
కర్ణాటక రాష్ట్రంలోని ఒక చోట కళాకారులు నాటకం వేస్తున్నారు. ఆ నాటకంలో ప్రేక్షకుల ముందు ఛాముండేశ్వరి అవతారంలో ఒకరు, మైశాసురుడనే రాక్షసుడు అవతారంలో ఒకరు నటిస్తున్నారు. ఈ క్రమంలో ఛాముండేశ్వరి ఉగ్రరూపం దాల్చుతది ఆ మైశాసురుడిని చూసి. ఆ ఛాముండేశ్వరిని చూసి మైశాసురుడనే రాక్షసుడు కింద పడిపోతాడు. వాస్తవంగా ఆయన పడటంతోనే నాటకంకు తెరపడుతుంది. కానీ బ్యాగ్రౌండ్స్ మ్యూజిక్, పాటను అనుసరిస్తూ క్లైమాక్స్ లో ఛాముండేశ్వరి పాత్రలో ఉన్న వ్యక్తి ఆ పాత్రలో లీనమైయ్యాడు. ఏకంగా చేతిలో ఉన్న త్రిశూలంను కింద పడిపోయిన మైశాసురుడుని పొడవడానికి ప్రయత్నం చేశాడు.


అర్రె..! ఇది మన నాటకంలో లేదే? అని వెంటనే పసిగట్టిన ప్రక్కన వారు ఛాముండేశ్వరిని పట్టుకున్నారు. వెంటనే లైట్లు ఆపచేశారు. ఇది తెలుసుకున్న మైశాసురుడు పాత్ర దారి బతుకుజీవుడా వామ్మో అంటూ..! చచ్చిబతికినంత పనైందనే విధంగా బిక్కమొఖం వేశాడు. ఛాముండేశ్వరి పాత్రలో ఉన్న వ్యక్తికి, మైశాసురుడు పాత్రలో ఉన్న వ్యక్తి ఎలాంటి విబేధాలు, తగాదాలు లేవు. కానీ ఛాముండేశ్వరి పాత్రలో లీనమైన ఆ వ్యక్తి నటించమంటే జీవించిపోయాడు. ఇంకా నయం ప్రక్కన వాళ్లు పట్టించుకోకపోతే మైశాసురుడు గుండెల్లోకి త్రిశూలం దిగేదట!.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.!
ఇది చదవండి:మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
ఇది చదవండి:భార్యపై ప్రేమ..నిలువెత్తు విగ్రహం ప్రతిష్టత
ఇది చదవండి:రోడ్డు ప్రమాదంలో 50 గొర్రెలు మృతి
ఇది చదవండి:మిస్సైన బంగారం దొంగలు దొరికారు!
ఇది చదవండి: 26న దేశవ్యాప్తంగా బంద్కు పిలుపు!
ఇది చదవండి:కిడ్నాప్ నాటకమాడిన యువతి ఆత్మహత్య
ఇది చదవండి:దెయ్యం భయ్యం..కాలనీ ఖాళీ చేసిన ప్రజలు