Chillakallu SI | చిన్న చిన్న కుటుంబ కలహాలు, సరిహద్దు వివాదాలు, దొమ్మి కేసులు మొదలైన ఇతర కేసులలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. అలాకాకుండా రాజీ మార్గమే రాజ మార్గం గా నిర్వహించే మెగా లోక్ అదాలత్(Mega lok Adalat 2022)లో రాజీ చేయదగిన కేసులలో పోలీసు అధికారుల, సిబ్బంది సమక్షంలో ఇరు కుటుంబాలను పిలిపించి, గొడవలతో సమయాన్ని వృథా చేసుకోవద్దని సామరస్యంగా సమస్యను పరిష్కరించు కోవాలని కౌన్సిలింగ్ నిర్వహించి వారి మధ్య ఐక్యత ఏర్పరిచే ఏకైక కార్యక్రమమే లోక్ అదాలత్.
434 కేసులను రాజీ చేసిన ఎస్సై చినబాబు(CH.China babu)
చిన్నచిన్న తగాదాలతో కేసులో చిక్కుకున్న వారందరికీ లోక్ అదాలత్ ద్వారా పరిష్కార మార్గం చూపి, ఇరువురి మధ్య సఖ్యత ఏర్పాటు చేయడం జరుగుతుంది. అత్యధిక సంఖ్యలో కేసులను రాజీ చేయడంలో కృష్ణాజిల్లా ప్రథమంగా నిలవడంతో కృష్ణా జిల్లా పోలీస్ శాఖను జిల్లా జడ్జి కె.నరసింహమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా జిల్లా మొత్తంలో అత్యధికంగా 434 కేసులను రాజీ చేసిన చిల్లకల్లు పోలీస్ స్టేషన్ ఎస్ఐ(Chillakallu SI) సిహెచ్. చినబాబును ప్రత్యేకంగా అభినందించారు.

అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అత్యధిక కేసులను రాజీ చేసిన చిల్లకల్లు ఎస్ఐ ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంత అత్యధికంగా కేసులు రాజీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన హెడ్‌కానిస్టేబుల్-767 ఆర్ కిషోర్ ను ఎస్పీ వీక్లీ బెస్ట్ ఫెర్మార్మెన్స్ అవార్డ్ అందజేసి చేసి ప్రత్యేకంగా అభినందించారు. అంతేగాక మెగా లోక్ అదాలత్ లో కేసులను రాజీ చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్క సిబ్బందిని, కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!