dead body on bike

dead body on bike : ఎంత‌క‌ష్టం! బైక్‌పై మృత‌దేహం త‌ర‌లింపు!

Spread the love

dead body on bike : చ‌నిపోయిన వ్య‌క్తి మృత‌దేహాన్ని బైక్‌పై త‌ర‌లించిన సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో వెలుగు చూసింది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధుడు మృత‌దేహాన్ని అంబు లెన్స్‌లో త‌ర‌లించేందుకు అంత డ‌బ్బు లేక‌పోవ‌డంతో ద్విచ‌క్ర‌వాహ‌నంపై తీసుకెళ్లారు.


dead body on bike : క‌రోనా వ్యాప్తితో మెడిక‌ల్ స‌ర్వీసుల ధ‌ర‌ల‌న్నీ అడ్డ‌గోలుగా మారిపోయాయి. అంబులెన్సుల ధ‌ర‌లైతే ఇక చెప్పే ప‌ని లేదు. ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా డ్రైవ‌ర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో అంబులెన్స్ ఖ‌ర్చులు భ‌రించ‌లేక ఓ పెద్దాయ‌న చ‌నిపోతే అత‌ని మృత‌దేహాన్ని కుటుంబీకులు బైక్‌పై తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖ‌మ్మం జిల్లా ఆత్కూరు స‌మీపంలో మ‌ల్లారం గ్రామానికి చెందిన ఎర్ర‌నాగుల నారాయ‌ణ (70) కు సుమారు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ మ‌ధిర‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందాడు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం గుండెల్లో నొప్పిగా ఉంద‌ని అత‌డు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మోటారు సైకిల్‌పై మ‌ధిర‌కు వ‌స్తున్నాడు. సిరిపురం గ్రామంలో ఓ ఆర్ఎంపీ వ‌ద్ద చూపించుకోగా ఆయ‌న మ‌ధిర‌లోని ఆసుప‌త్రిలో వైద్యం చేయించుకోమ‌ని సూచించాడు. ద్విచ‌క్ర‌వాహ‌నం పై మ‌ధిర‌కు తీసుకెళ్తుండ‌గా ఆత్కూరు స‌మీపంలోకి రాగానే ఒక్క‌సారిగా గుండెపోటు రావ‌డంతో మోట‌ర్ సైకిల్‌పైనే మృతి చెందాడు. అంబులెన్స్‌లో తీసుకెళ్దామంటే వేలాది రూపాయ‌లు కిరాయి అడుగుతున్నార‌ని అందుకే ద్విచ‌క్ర‌వా హ‌నంపై ఇంటికి తీసుకెళ్తున్నామ‌ని బాధితుడు వాపోయాడు. అస‌లే క‌రోనా స‌మ‌యం కావ‌డంతో అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌న్నీ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుల‌కు క‌ష్టం వ‌స్తే ఇలాంటి బాధ‌లు త‌ప్ప‌నిస‌రి అయ్యాయి. ఇటీవ‌ల ఇలాంటి ఘ‌ట‌న‌లు దేశంలో ప‌లు సంద‌ర్భాల్లో క‌నిపించాయి.

Driving Licence : డ్రైవింగ్ చేయాల‌నుకునేవారికి ఇవి లేక‌పోతే అంత ఆషామాషీ కాదు!

Driving Licence : ప్ర‌స్తుత కాలంలో డ్రైవింగ్ చేసేవారి సంఖ్య పెరిగింది. ఇదే సంద‌ర్భంలో రోడ్డు ప్ర‌మాదాలూ పెరిగాయి. వాహ‌నం న‌డిపేట‌ప్పుటు తీసుకోవాల్సిన జాగ్రత్త‌లు, ఎలాంటి అనుమ‌తి Read more

Myanmar Capital : ఆ రాజ‌ధానిని దెయ్యాల న‌గ‌రంగా ఎందుకు పిలుస్తారు?

Myanmar Capital : ఆ రాజ‌ధానిని దెయ్యాల న‌గ‌రంగా ఎందుకు పిలుస్తారు? Myanmar Capital : ఆ న‌గ‌రంలోకి అడుగు పెట్ట‌గానే అత్యద్భుతంగా తీర్చిదిద్దిన విలాస‌వంత‌మైన 20 Read more

The Chukudu wooden vehicle: కాంగో పేద‌ ప్ర‌జ‌ల‌కు ఇష్ట‌మైన వాహ‌నం చుకుడు!

ఎటువంటి ఇంధ‌నం అవ‌స‌రం లేదు!పెద్ద‌గా ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు!ఒక్క‌సారి త‌యారు చేయించుకుంటే మూడేళ్ల‌పాటు ఉప‌యోగం! The Chukudu: ప్రపంచంలోని రోజురోజుకూ పెరుగుతున్న కొత్త టెక్నాల‌జీతో కొత్త Read more

Talluri venkatapuram(Khammam): తాళ్లూరు వెంకటాపురం వాసికి డాక్టరేట్

Talluri venkatapuram(Khammam) ఖమ్మం: కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామానికి చెందిన సాంబత్తిని వెంకటేశ్వర్లు కి కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో " Read more

Leave a Comment

Your email address will not be published.