Tirupati by Election Counting : తిరుపతి ఉప ఎన్నికకు రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే పోలీసు యంత్రాంగం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసింది. 144 సెక్షన్ను రేపు అమల్లో ఉంటుంది. విజయోత్సవ ర్యాలీలు నిషేధమంటూ తిరుపతి అర్బన్ ఎస్పీ ఎస్పీ సిహెచ్ వెంకట అప్పల నాయుడు సూచించారు.
Tirupati by Election Counting : రేపు (మే 2) తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తిరుపతి అర్బన్ ఎస్పీ సిహెచ్ వెంకట అప్పల నాయుడు తెలిపారు. ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు విధుల్లో 11 మంది డిఎస్పీలు, 14 మంది సిఐలు, 30 మంది ఎస్సైలు 89 మంది ఏఎసైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు , 17 మంది హోం గార్డులతో మొత్తం 320 మంది ఏఆర్, ఏపీఎస్పీ , సిఆర్పిఎఫ్, స్పెషల్ పోలీసు బలగాలు పాల్గొంటాయని తెలిపారు. కౌంటింగ రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.ముగ్గురి కన్నా ఎక్కువ మంది గుమ్మికూడి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరిం చారు. బాలాజీ కాలనీ నుండి ఎస్వియు మెయిన్ గేట్ వరకు ట్రాఫిక్ మళ్లింపు జరుగుతుం దన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వెంట ఇద్దరు మించి ఊడకూడదని సూచించారు.
విజయోత్సవ ర్యాలీలు నిషేధం!
ఎన్నికల ఫలితం వెలువడి అనంతరం గెలిచిన అభ్యర్థులు ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని ఎస్పీ తెలిపారు . కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబధనలు తప్పనిసరిగా పాటించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ రోజున జరిగే సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు కమాండ్ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 8099999977, లేదా 6309913960 లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం