ఎటువంటి ఇంధనం అవసరం లేదు!
పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు!
ఒక్కసారి తయారు చేయించుకుంటే మూడేళ్లపాటు ఉపయోగం!
The Chukudu: ప్రపంచంలోని రోజురోజుకూ పెరుగుతున్న కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. కష్టం ఖర్చు కాకుండా సమయం వృధా కాకుండా వేగంగా అనుకున్న పని క్షణాల్లో పూర్తయ్యే విధంగా కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. సామాన్యుడు మొదలుకొని పెద్దపెద్ద కంపెనీల్లో పనిచేసే వర్కర్లు వరకు సులువుగా పని చేసేందుకు ఆధునిక పరికరాలను వాడుతున్నారు. దీంతో సమయం ఆదా అవ్వడంతో పాటు ఒక మనిషి చేసే పనిగంటలు పెరుగుతున్నాయి. అదే విధంగా మారుతున్న కాలానుగుణంగా పేదవారు సైతం తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త టెక్నాలజీతో సమానంగా కొత్తకొత్త యంత్రాలను రూపొందిస్తున్నారు. అందులో ఒకటి చుకుడు(Chukudu) అనే ద్విచక్రవాహనం. ఈ చుకుడు గా పిలువబడే ద్విచక్రవాహనం ఎక్కువుగా కాంగో దేశంలో కనిపిస్తుంది. ఈ చుకుడు ద్విచక్ర వాహనాన్ని కాంగో దేశం తూర్పు ప్రాంతంలో ఎక్కువుగా సామాన్య ప్రజలు వినియోగిస్తారు. భారతదేశంలో ప్రతి మధ్యతరగతి వ్యక్తి సైకిల్ ను ఎలా ఉపయోగిస్తారో? అదే విధంగా కాంగో(cango) దేశంలో ఈ చుకుడు వాహనాన్ని ఉపయోగిస్తారు. ఇది సైకిల్ కంటే మూడు చక్రాల ఆటో ట్రక్కు మోసేంత బరువును మోయకలిగే సామర్థ్యం ఉంది.

ఇది ఎలా తయారు చేస్తారు?
చుకుడు(Chukudu) వాహనాన్ని చెక్కతో తయారు చేస్తారు. దీనికి రెండు చెక్క చక్రాలు కూడా ఉంటాయి. ఆ చెక్క చక్రాలకు రబ్బర్‌ను చుట్టి ఉంటుంది. ఒక హ్యాండిల్ ఉంటుంది. ఇది నడిపే వ్యక్తి ఒక కాలును వాహనం పైన ఉంచుతాడు. మరో కాలుతో నెట్టుకుంటూ నడుపుతాడు. వెనుక చక్రం బ్రేక్ వేయడానికి చక్రం వద్ద రబ్బర్ ఏర్పాటు చేస్తారు. దాన్ని కాలితో నొక్కిపడితే ఆ చుకుడు వాహనం ఆగిపోతుంది. చుకుడస్ ద్విచక్ర వాహనాన్ని యూకలిఫ్టస్ కలపతో తయారు చేస్తారు. వీల్ ట్రెడ్స్ కోసం స్క్రాప్ టైర్లతో తయారు చేస్తారు. ఈ చుకుడస్ వాహనాన్ని తయారు చేయడానికి ఒకటి నుంచి మూడు రోజులు సమయం పడుతుంది. ఈ వాహనాల సామర్థ్యం రెండు, మూడు సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ చుకుడస్ వాహనం పరిమాణం 6.50 అడుగుల పొడవు ఉంటుంది. 1000 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. అతిపెద్ద చుకుడస్ 800 కేజీల బరువును మోయగలదు. చిన్న పిల్లలు వాడుకునే చుకుడును మూడు గంటల్లో నిర్మించవచ్చట. డైమెన్షనల్ కలపతో పాటు మార్కెట్లో లభించే హార్డవేర్ మెటీరియల్ తో తయారు చేయవచ్చట.

అన్ని రకాల సరుకుల రవాణా సాధనం!
ఈ చుకుడస్ వాహనాలను అన్ని రకాల సరుకులను రవాణా చేయడానికి, తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. కట్టెలు, బస్తాలు, పెద్దపెద్ద మొద్దులు, ఇంటి సామాగ్రి, ఐరన్ పనిముట్లు, మంచినీళ్లు తదితర సరుకులను సులువుగా రవాణా చేయవచ్చట. మన ఇండియాలో ఆటో రిక్షాలపై ఆధారపడి ఎలా జీవనం సాగిస్తున్నారో కాంగో దేశంలో కూడా అదే విధంగా చుకుడు ద్విచక్ర వాహనాన్ని ఓ రిక్షా లాగా ఉపయోగించి కావాల్సిన వారి సరుకులను రవాణా చేసి ఆదాయం సంపాదించుకుంటారు. ప్రతి సెంటర్ లోనూ ఈ చుకుడు వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ వాహనాలపై ఆధారపడి ఎంతో మంది అక్కడ కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి ఇంధనం పోయకుండా కేవలం సులువుగా నడపగలిగే ఈ చుకుడు వాహనాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చుకుడస్ ను మొట్టమొదటిగా 1970 సంవత్సరంలో ఉత్తర కివులో తయారు చేశారు.
The Chukudu వాహనం వీడియోలు( Chukudu Youtube videos)
- Meet the chukudu : Congo’s homemade scooter | Africa on the move
- What is a CHUKUDU ? ( Goma, Congo)
- DR Congo’s tshukudu, the all – Purpose transport scooter
- Usafiri Wa chukudu DRC
- Magazin erklart Chukudu
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!