Cheetah: అర్థ‌రాత్రి ఇంట్లోకి చొర‌బ‌డిన చిరుత‌ | kalapalyam Tamil Nadu

Cheetah: అర్థ‌రాత్రి ఇంట్లోకి చొర‌బ‌డిన చిరుత‌ | kalapalyam Tamil Nadu

Cheetah: త‌మిళ‌నాడు : ఎండా కాలం కావ‌డంతో ఉక్క‌పోత భ‌రించ‌లేక జ‌నాలు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో రాత్రి వేళ‌లో కొంత మంది ఇళ్ల‌కు తలుపులు వేయ‌కుండా గాలికోసం తెరిచి ఉంచుతున్నారు. అయితే ఇలా తెరిచి ఉన్న ఇంట్లోకి ఓ అర్థ‌రాత్రి చిరుత ప్ర‌వేశించి ఆ కుటుంబంపై దాడి చేసింది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

త‌మిళ‌నాడు రాష్ట్రం క‌ల‌పాళ్యం గ్రామం స‌మీపంలో బుధ‌వారం రాత్రి వేలాయుధం భార్య ప్రేమ ఇద్ద‌రు పిల్ల‌లు మ‌నోహ‌ర్‌, మ‌హాల‌క్ష్మిలు నిద్రిస్తున్నారు. వేస‌వి తాపం అధికంగా ఉండ‌టంతో ఇంటి త‌లుపులు తీసి ప‌డుకున్నారు. అయితే అర్థ‌రాత్రి ఇంట్లోకి చొర‌బ‌డిన చిరుత పులి ప్రేమ (40), పిల్ల‌లు మ‌నోహ‌ర‌న్ (20), మ‌హాల‌క్ష్మి (14)ల‌పై దాడి చేసింది.

అర్థ‌రాత్రి చిరుత‌దాడితో భ‌య‌భ్రాంతుల‌కు గురైన వేలాయుధం కుటుంబం ఇంటి బ‌య‌ట ప‌రుగులు తీయ‌డంతో పాటు ఇంటి త‌లుపులు మూసేసి తాళం వేశారు. దీంతో ఇంట్లో న‌క్కిన చిరుతను ప‌ట్టుకునేందుకు అట‌వీ అధికారులు ప్ర‌య‌త్నాలు చేశారు. చిరుత దాడిలో గాయ‌ప‌డిన ముగ్గురుకి చికిత్స నిమిత్తం గుడియాత్తం ప్ర‌భుత్వాసుపత్రికి త‌ర‌లించారు. ఎట్ట‌కేల‌కు చిరుత‌ను అట‌వీ శాఖ అధికారులు బంధించి అడ‌వి తీసుకెళ్లారు.

చ‌ద‌వండి :  Ratna Prabha IAS | Former IAS Ratna Prabha Contest in Tirupathi | తిరుప‌తి లోక్‌స‌భ అభ్య‌ర్థిగా ర‌త్నప్ర‌భా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *