Covid 19 Scheme : కరోనాతో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారం ఇవ్వనుందని ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల మీడియాలో వెబ్సైట్ అడ్రస్ వైరల్ అయ్యింది. దీంతో కరోనాతో చనిపోయిన వారికి డబ్బులు వస్తాయోమోనని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ లేదని ఆ స్కీం ను ఉపసంహరించుకుంది. దీంతో ఉపసంహరణ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Covid 19 Scheme : కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబ సభ్యులకు రాష్ట్ర విపత్తుల నివారణ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి రూ.4 లక్షలు ఆర్థిక సహాయంగా చెల్లించాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చి 14న ఉత్వర్వులు జారీ చేసింది. మళ్లీ అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని ఉపసంహరించుకుంది. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాలు దీనిని విపత్తుగా ప్రకటించి బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు నిర్థారణ పరీక్షలు, చికిత్స, ఇతర సదుపాయాలు కల్పించాలని కేంద్ర హోం శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పట్లోనే వెనక్కి తీసుకున్న ఈ ఉత్తర్వులు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆర్థిక సహాయం కోసం నిర్ధేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ కొంత మంది సామాజిక మాధ్యమాల్లో పంపుతున్నారు. అయితే అసలు విషయం తెలియక చాలా మంది నిజంగానే రూ.4 లక్షల పరిహారం లభిస్తుందని భావించారు. ఎన్డీఆర్ఎఫ్ కింద చేపట్టే సహాయక పనుల్లో 75 శాతం నిధులను కేంద్రం, 25 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కరోనా మృతుల సంఖ్య భారీగా ఉండటంతో పరిహారం చెల్లింపు సాధ్యం కాదన్న భావనతో కేంద్రం ఈ ఆదేశాలను ఉపసం హరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలన్న అంశంపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!