Police Siren

Police Siren : పోలీసు సైర‌న్ పెట్టుకున్నాడ‌ట‌..ఎందుకంటే?

Spread the love

Police Siren : అత‌ని ఆలోచ‌న మాములుగా లేదు. సొంత కారుకు పోలీస్ సైర‌న్ పెట్టుకొని ద‌ర్జాగా తిరుగుతూ టోల్‌గేట్ల వ‌ద్ద‌, పోలీసుల చెక్‌పోస్టుల వ‌ద్ద త‌ప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్ర‌మంలో ఏకంగా పోలీసుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అడిగితే ముంబై ఇంటిలిజెన్సీ ఎస్పీ అన్నాడు. ఐడీ కార్డు అడిగితే దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. పోలీసులు వారి లెవ‌ల్లో ప్ర‌శ్నిస్తే దొరికిపోయాడు.


Police Siren : పోలీసు చెక్‌పోస్టులు, టోల్ ఫీజులు నుంచి త‌ప్పించుకునేందుకు కారుకు పోలీసు సైర‌న్ అమ‌ర్చి తిరుగుతున్న ఓ వ్య‌క్తి ని అరెస్టు చేసిన‌ట్టు మంచిర్యాల జిల్లా ఏసీపీ అఖిల్ మ‌హాజ‌న్ తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్‌స్టేష‌న్ లో ఏసీపీ అఖిల్ మ‌హాజ‌న్ విలేక‌ర్ల‌కు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..గోదావ‌రిఖ‌నికి చెందిన ఎన్న ప్ర‌దీప్‌కుమార్ అనే వ్య‌క్తి కారుకు పోలీస్ సైర‌న్ పెట్టుకుని నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ నుంచి గోదావ‌రిఖనికి వెళ్తున్నాడు. అనుమానం వ‌చ్చిన హాజీపూర్ పోలీసులు వాహ‌నాన్ని ఆపి త‌నిఖీలు చేప‌ట్టారు. ఆ వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న ప్ర‌దీప్‌కుమార్‌ను వివ‌రాలు అడ‌గ‌గా తాను ముంబైలో ఇంటెలిజెన్సీ బ్యూరోలో ఎస్పీగా ప‌నిచేస్తున్నాన‌ని తెలిపాడు. ఉద్యోగానికి చెందిన గుర్తింపు కార్డును చూపించాల‌ని కోర‌గా దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

పోలీసులు, టోల్‌గేట్ల బారి నుంచి కాపాడుకునేందుకు సైర‌న్ అమ‌ర్చిన‌ట్టు నిందితుడు ఒప్పుకున్న‌ట్టు ఏసీపీ తెలిపారు. కారును సీజ్ చేసి ప్ర‌దీప్‌కుమార్‌పై కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు పంపిన‌ట్టు పేర్కొన్నారు.ఈ మీడియా స‌మావేశంలో మంచిర్యాల గ్రామీణ సీఐ కుమార‌స్వామి, ఎస్ఐ చంద్ర‌శేఖ‌ర్‌, శిక్ష‌ణ ఎస్ఐ తిరుప‌తి, సిబ్బంది పాల్గొన్నారు.

Current Shock:విషాదం: క‌రెంట్ షాక్ త‌గిలి భార్య‌భ‌ర్త‌లు మృతి

Current Shock బ‌య్యారం: స్నానం చేసి బ‌ట్ట‌లు ఆర‌వేస్తుంటంతో విద్యుత్ షాక్ త‌గిలి భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు మృతి చెందిన సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా బ‌య్యారం మండ‌లం కొత్త‌పేట Read more

vaccine drive:త్వ‌ర‌గా పూర్తి చేయండి వ్యాక్సినేష‌న్: మంత్రి హ‌రీష్ రావు

vaccine driveహైద‌రాబాద్: రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికీ రెండు డోసులు వ్యాక్సిన్ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారుల‌ను ఆదేశించారు. Read more

municipal commissioner:నూతన కమిషనర్ కు అభినందనలు-ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర సమితి

municipal commissioner ఫీర్జాదిగూడ: 'ఇంకెంత కాలం కాలయాపన చేస్తారు.. కార్మికులకు జీతాలు పెంచకుండా..' మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు పెంచి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ Read more

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

TRS Plenary Meeting: హైద‌రాబాద్ : 'ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున‌నారు.. టి- కాంగ్రెస్‌, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే Read more

Leave a Comment

Your email address will not be published.