Swimming : బావిలో దూకిన బాలుడు – ల‌భ్యం కాని మృత‌దేహం!

Swimming: ఈత నేర్చుకోవాల‌నే ఆ బాలుడు ఆశ అత‌న్ని మృత్యుఒడిలోకి తీసుకెళ్లింది. బావిలో ప్రాణాలు వ‌దిలిని ఆ బాలుడు మృత‌దేహం ఇంత వ‌ర‌కూ ల‌భ్యం కాక‌పోవ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.


Swimming: ఈత నేర్చుకోవ‌డానికి ఓ బాలుడు బావితో దూక‌డంతో దుర‌దృష్ట‌వ‌శాత్తు మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పాకాల మండ‌లం ర‌మ‌ణ‌గారిప‌ల్లి పంచాయ‌తీ ర‌మ‌ణ‌య్య‌గారిప‌ల్లి స‌మీపంలో ఆదివారం చోటు చేసుకుంది. బాలుడు మృత‌దేహం ఇంత వ‌ర‌కూ క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు, బంధువులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తిరుప‌తికి చెందిన ప‌వ‌న్‌సాయి సెల‌వులు కావ‌డంతో పాకాల మండ‌లం ర‌మ‌ణ‌య్య‌గారిప‌ల్లి గ్రామంలో ఉన్న పిన్న‌మ్మ ఇంటికి వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆదివారం పిల్ల‌ల‌తో క‌లిసి స‌మీపంలోని బావి ద‌గ్గ‌రు వెళ్లారు. అయితే తొలుత ఈత కొడుతున్న పిల్ల‌ల‌ను చూసి ఈత నేర్చుకోవాల‌నే ఆలోచ‌న‌తో ప‌వ‌న్ సాయి గ‌ట్టుపై ఉండి బావిలో దూకాడు. దీంతో అప్ప‌టి నుంచి క‌నిపించ‌కుండా గ‌ల్లంత‌య్యాడు. విష‌యం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది బావి వ‌ద్ద‌కు వ‌చ్చి నాలుగు మోటార్ల స‌హాయంతో నీటిని బయ‌ట‌కు తోడుతున్నారు. బావి పెద్ద‌ది కావ‌డంతో పాటు నీళ్లు ఎక్కువుగా ఉండ‌టంతో మృత‌దేహం ఆచూకీ ల‌భించ‌డం లేద‌ని పాకాల అసిస్టెంట్ ఆఫీస‌ర్ విశ్వ‌నాధం తెలిపారు. మృత‌దేహం కోసం తీవ్రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. తిరుప‌తిలో ఉన్న త‌ల్లిదండ్రులు విష‌యం తెలుసుకుని సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని క‌న్నీటి ప‌ర్యంత‌ మ‌య్యారు. గ్రామ‌స్థులు బావి వ‌ద్ద‌కు పెద్ద సంఖ్య‌లో చేరారు. ఫైర్ సిబ్బంది స‌హాయ స‌హ‌కారాలు ముమ్మ‌రం చేశారు. ఈ సంద‌ర్భంగా పాకాల ఎస్సై ఐ.వంశీధ‌ర్‌, సిబ్బంది సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *