Home Loans: 2021లో సులువుగా హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకుల వివరాలు! | Best Banks for home loan
Home Loans: సొంతిల్లు అనేది మనందరి కల. మన దగ్గర కష్టపడిన డబ్బులు ఉంటే ఒక సమయం చూసి ఆ డబ్బుతో సొంత ఇల్లు నిర్మించుకుంటాం లేదా కొనుగోలు చేస్తాం. ఒక వేళ అంత డబ్బులు లేకపోతే ఏం చేయాలి? అయితే సింపుల్‌గా బ్యాంక్‌కు వెళ్లి హోం లోన్(Home Loans) తీసుకొని మన కలను సాకారం చేసుకోవచ్చు. అయితే మనకు హోం లోన్ లభించాలంటే మనకు క్రెడిట్స్ స్కోరైనా ఎక్కువగా ఉండాలి. అదే విధంగా మనకు లోన్ తీసుకునేందుకు అర్హత కూడా ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ఈ 2021 సంవత్సరంలో హోం లోన్(Home Loans) తీసుకోవాలంటే కొన్ని బ్యాంకుల వివరాలను తెలుసుకోండి.


సాధారణంగా బ్యాంకులు మనకు లోన్లు ఇచ్చేటప్పుడు Pre Closure Charges ని మినిమం 2% వరకు వసూలు చేస్తాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే బ్యాంకులు మాత్రం ఎలాంటి Pre Closure Charges ని వసూలు చేయవు.
అసలు Pre Closure Charges ఛార్జీలు అంటే ఏమిటి?
ఉదాహరణకు ‘ x ‘ అనే వ్యక్తి ఓ బ్యాంకు నుండి సుమారు రూ.10,00,000 లోన్ తీసుకున్నారనుకోండి! tenure(గడువు) వచ్చేసి 5 సంవత్సరాలు పెట్టుకున్నారునుకుందాం!. అయితే లోన్ తీసుకున్న వ్యక్తికి ఒక ఏడాది గడిచిపోయింది. EMI ఒక ఏడాది కట్టాడు. మరో సంవత్సరం వచ్చింది. ఆ వ్యక్తికి ఏదో రూపంలో తన కష్టార్జితంగా ఆదాయం వచ్చింది. మొత్తం డబ్బులు తీసుకొని వెళ్లి ఆ వ్యక్తి బ్యాంకులో లోన్‌ను క్లియర్ చేసుకున్నాడునుకుందాం!. అయితే బ్యాంకు వారు కాస్త ఛార్జి చెల్లించమని అడుగుతారు. అది ఎలాగంటే? మీరు 5 సంవత్సరాలు గడువు పెట్టుకొని ఒక ఏడాది లో కట్టేస్తే బ్యాంకుకు లాస్ అవుతుంది కదా అని బ్యాంకు వారు ఇలా Pre Closure Charges ని అడుగుతారు. ఆ ఛార్జీలు తీసుకున్న మొత్తానికి 1%, 2% కానీ ఛార్జీ వసూలు చేస్తారు. కానీ ఇప్పుడు చెబుతున్న బ్యాంకులు మాత్రం ఎలాంటి Pre Closure Charges వసూలు చేయవు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్‌ను తీర్చుకోవచ్చు. అలాగే Interest rates కూడా చాలా తక్కువుగా ఉన్నాయి. కేవలం 6.9 % శాతం మాత్రమే Interest rates రేటు ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పబోయే బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి వెరొకరి సంతకం కూడా అవసరం లేదు.చాలా సులువుగా లోన్ అప్రూవల్ చేస్తారు.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆంధ్రాబ్యాంక్) లో ప్రి క్లోజర్ ఛార్జీలు ఉండవు. పార్ట్ పేమెంట్ ఛార్జీలు కూడా ఉండవు. లోన్ తీసుకునేందుకు గ్యారెంటర్ కూడా అవసరం లేదు. ఇక వడ్డీ పరిశీలిస్తే ఈ బ్యాంకులో 6.90% నుంచి 7.17 % వరకు ఉంది. ఒక వేళ ఎంసీఎల్ఆర్, రెపోరేట్ ను బట్టి వడ్డీ రేట్లు మార్పులు వస్తే మనం కట్టాల్సిన వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. అయితే మీరు హోం లోన్ తీసుకున్నప్పుడు ఎంత వడ్డీ బ్యాంకు వారు చెబుతున్నారో గడవు వరకు మీరు చెల్లించే వరకు అదే వడ్డీ రేటు ఉంటుంది. అయితే ఇందులో ఎంసీఎల్ఆర్, రెపోరేట్ ను బట్టి వడ్డీ రేటు పెరిగినా మీకు సంబంధం ఉండదు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.మీ అవసరాన్ని బట్టి లోన్ లక్ష నుంచి కోటి రూపాయల వరకు పొందవచ్చును.ప్రోససింగ్ ఫీజు బ్యాంకు వారు ఒక్కసారే తీసుకుంటారు. అదీ కూడా 0.50% నుంచి మాక్సిమం రూ.15,000 వరకు మాత్రమే ఫీజు తీసుకుంటారు.ఈ లోన్ తీసుకోవాలంటే కాస్త ఆర్థికంగా రాబడి వచ్చే వనరులు మీకు ఉండి ఉండాలి. అది మంచి జాబ్ అయినా, వ్యాపారమైనా ఏదైనా సరే!
Union Bank of India Home Loan(Andhra Bank merged)
Our Pick for | Relatively low rate of interest |
Other plus points | No pre-closure or part – payment fees, No guarantor needed |
Interest Rate | 6.90% – 7.17 % (floating) |
Loan Tenure | 1-30 years |
Loan Amount | Rs. 25 lakhs onwards |
Processing Fee | Up to 0.50% of loan amount (max. of Rs.15,000 ; one – time fee) |
ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో లోన్ కావాలంటే ఒక వేళ మహిళలల పేరుమీద అప్లై చేసుకుంటే కాస్త డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. అది వడ్డీలో కావచ్చు. ప్రాసిసింగ్ ఫీజులో కావచ్చు. ఈ బ్యాంకులో కూడా ప్రీక్లోజర్, పార్ట్ పేమెంట్ ఫీజుల ఛార్జీలు లేవు. ఈ బ్యాంకులో కూడా గ్యారంటరీ వారు కూడా అవసరం లేదు. ఈ బ్యాంకులో లోన్‌కు అప్లై చేసుకుంటే కేవలం 4 రోజుల్లోనే అప్లూవల్ అయ్యే ఛాన్స్ ఎక్కువుగా ఉంది. ఇక వడ్డీ గురించి 6.95% నుంచి 7.50% వరకు ఉంది. లోన్ చెల్లింపు కాలం ఎంత ఉంటుందంటే ఒక ఏడాది నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. లోన్ అమౌంట్ రూ.5 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు లభిస్తుంది. ప్రాసిసింగ్ ఫీజు 0.50% మాత్రమే ఉంటుంది.
HDFC Ltd. Home Loan
Our Pick for | Special offers for women applicants |
Other plus points | No pre-closure and part – payment fees, No guarantor needed, Quick approval time (4 days) |
Interest Rate | 6.95% – 7.50 % (floating) |
Loan Tenure | 1 – 30 years |
Loan Amount | Rs.5 Lakhs to Rs.10 crores |
Processing Fee | Up to 0.50 % of loan amount (max. of Rs. 11,800 ; one – time fee) |
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) లో కూడా ప్రీ క్లోజర్ ఛార్జీలు, పార్ట్ పేమెంట్ ఛార్జీలు లేవు. గ్యారంటర్ కూడా అవసరం లేదు. వడ్డీ కూడా 8.60 % – 9.45% వరకు ఉంటుంది. లోన్ చెల్లింపు కాలం ఒక ఏడాది నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. లోన్ అమౌంట్ రూ.8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసిసింగ్ ఫీజు వచ్చేసి 0.25% వరకు ఉంటుంది. మాక్సిమం రూ.15,000(వన్‌టైం మాత్రమే) వరకు ఉంటుంది.
PNB Housing Home Loan
Our Pick for | No pre closure of part – payment fees |
Other plus points | No guarantor needed |
Interest Rate | 8.60% – 9.45% p.a. (floating) |
Loan Tenure | 1 – 30 years |
Loan Amount | Rs.8 lakhs onwards |
Processing Fee | Up to 0.25% of loan amount (max. of Rs.15,000 ; one – time fee) |


గమనిక : మేము కేవలం వీటిని పరిశీలించి మాత్రమే మీకు వివరాలు అందిస్తున్నాం. హోం లోన్‌కు సంబంధించి ఇవి కాస్త బెస్ట్ బ్యాంకులుగా ఉన్నాయి అని మాత్రమే చెబుతున్నాం. ఒక వేళ మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులు, మీకు తెలిసిన బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు ఇస్తే మీరు స్వయంగా వెళ్లి లోన్ వివరాలు తెలుసుకోవచ్చు. లోన్ కూడా తీసుకోవచ్చు. అదే విధంగా లోన్ల విషయంలో బయట వ్యక్తులను(మధ్యవర్తులను) ఎవ్వరినీ సాధారణంగా నమ్మి మోసపోవద్దు. మీకు లోన్ కావాలా? అంటూ మీ నెంబర్లకు వచ్చే ఫోన్ల ను కూడా నమ్మి మోసపోవద్దు. నమ్మకంగా బ్యాంకుకు వెళ్లి మీకు లోన్ విషయంలో చాలా వరకు బ్యాంకు సిబ్బందిపైనే ఆధారపడితే చాలా మంచిది.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం