TET Psychology Bits | టెట్ విద్యార్థులకు సైకాలజీ మీద అవగాహన తప్పనిసరిగా ఉండాలి. పరీక్షల్లో ఎక్కువగా సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు వస్తుంటాయి. వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి ప్రశ్నలు మాదిరిగా వస్తుంటాయి అనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ TET కోసం సైకాలజీకి సంబంధించిన కొన్ని TET Psychology Bits అందించాము. మీరు కూడా వీటిని ఒకసారి చదవండి. అవగాహన పెంచుకోండి.
TET Psychology Bits:టెట్-సైకాలజీ ప్రశ్నలు
1.రాజు అనే విద్యార్థి కోణాలను బట్టి త్రిభుజాలను అల్పకోణ, లంబకోణ, అధికోణ త్రిభుజాలను వర్గీకరించారు. ఆ విద్యార్థి నెరవేరే లక్ష్యం ఏమిటి?
జ.అవగాహన
2.స్పష్టీకరణలు అనేవి ఏవి?
జ.ప్రవర్తనా పరివర్తనలు
3.క్రమభిన్నాల పాఠ్యాంశంలో జ్ఞాన లక్ష్యానికి చెందిన సృష్టీకరణ అంటే ఏమిటి?
జ.భిన్నంలో లవహారాలు గుర్తించడం
4.ఇటీవల Eluruలో వింత వ్యాధి భారిన పడిన బాధితులకు సహాయపడుతూ సేవ చేస్తున్న విద్యార్థి ప్రవర్తన ఏ రంగాన్ని అనుసరిస్తుంది?
జ.భావవేశ రంగం
5.వినియోగ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ ఏది?
జ.ఫలితాలు తెలపడం
6.మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అంశం కానిది ఏది?
జ.లాక్షణీకరణం
7.ఏ సందర్భం విద్యార్థి అభిరుచిని సూచిస్తుంది?
జ.దేశ రాజధానిలో రైతుల దీక్షా కార్యక్రమంలో విద్యార్థి ఆసక్తిగా పాల్గొంటున్నాడు.
8.గణితం ద్వారా పెంపొందే విలువలు ఏమిటి?
జ.ఆత్మవిశ్వాసం, అనైతికత
9.విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థి నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడం వంటి లక్షణాలను అలవర్చుకున్న చర్య ఏమిటి?
జ.క్రమ శిక్షణ విలువ
10.ఉపాధ్యాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ఏయే జిల్లాల్లో ప్రవహిస్తుంది? బంగాళాఖాతం తీరంగా గల జిల్లాలు ఏవి? వంటి కృత్యాలు ఇచ్చినప్పుడు వారిలో అభివృద్ధి చేయగల నైపుణ్యం ఏమటి?
జ.పటాన్ని చదవడంలో నైపుణ్యం
11.విద్యావంతులందరూ మోటారు వాహనాలకు బదులుగా సైకిళ్లు ఉపయోగించడం వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ఊహించిన విద్యార్థిలో నెరవేరే లక్ష్యం ఏమిటి?
జ.వినియోగం
12.విద్యార్థి పంటను నాశనం చేసే చీడపీడలకు సంబంధించిన సమాచార సేకరణకు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబర్చడం ఏ లక్ష్యానికి సంబంధించినది?
జ.ప్రతిస్పందన
13.ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, Teaching అండ్ అసెస్సింగ్, ఎ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ గ్రంథాల రచయితలు ఎవరు?
జ.క్రాత్‌హాల్, అండర్సన్
14.రాజు అనే విద్యార్థి సంఖ్యలను అరోహణ, అవరోహణ క్రమంలో రాయడాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం ఏమిటి?
జ.జ్ఞానం
15.B అనే విద్యార్థి జనాభా లెక్కల పట్టికను వ్యాఖ్యానించాడు. R అనే విద్యార్థి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి వ్యాఖ్యానించాడు. ఆ విద్యార్థులు సాధించే లక్ష్యాలు ఏమిటి?
జ.బి-అవగాహన, ఆర్-వినియోగం
16.పరికరాలను ఉపయోగించి గాలికి బరువుందని నిరూపించే విధానాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థి మానసిక చలనాత్మక రంగంలో ఈ దశకు చెంది ఉంటాడు?
జ.హస్తలాఘనం
17.ఉపాధ్యాయుడి వల్ల ప్రేరణ పొందిన విద్యార్థి తన రాష్ట్రంలో చారిత్రక కట్టడాల విషయాన్ని సేకరించి పాఠశాల బులిటెన్ బోర్డుపై ప్రదర్శించాడు. ఈ వ్యాఖం ఏమిటి?
జ.సృష్టీకరణ