Teri Meri Katha Mp3 Song : టోనీ కిక్ మరియు బుల్లెట్ బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వచ్చిన అల్లాహే అల్లా సాంగ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ పాట యూట్యూబ్‌లో విడుదలైన కొద్ది రోజుల్లోన్నే చాలా స్పీడ్‌గా వైరల్ అయ్యింది. కారణం ఆ పాట కొత్త ఒరవడితో, డిఫరెంట్ స్క్రిప్ట్స్‌తో ప్రజలను ముఖ్యంగా కుర్రకారును మంత్రముగ్ధులను చేసింది.
మళ్లీ టోనీ కిక్ – బుల్లెట్ బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వచ్చిన మరో సాంగ్ Teri Meri Katha Mp3 Song కూడా ప్రేక్షకులకు, యూత్‌కు బాగా నచ్చింది. అల్లాహే సాంగ్ లానే ఈ సాంగ్‌ను కూడా యూత్ తమ వాట్సాఫ్ స్టేటస్‌లలో పెట్టుకుంటున్నారు. సినిమా పాటలకు ఏమాత్రమూ తీసిపోని ఈ సాంగ్స్ను యూత్ బాగా ఇష్టపడుతున్నారు.
ఈ పాటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ప్రాంతంలో పుడిమడక సముద్ర తీర ప్రాంతంలో షూట్ చేశారు. ఈ పాటలో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటుంది. అల్లాయే సాంగ్ లో విధంగా ఈ తేరి మేరీ కథలో కూడా టోనీ కిక్, బుల్లెట్ బండి లక్ష్మణ్ ప్రాణ స్నేహితులు. వీరు సముద్రంలో నాటు పడవలతో చేపలు పట్టే జాలర్లు. ఈ క్రమంలో ఒక ధనవంతుడు తన కూతురుతో సముద్ర తీరానికి వస్తాడు.
ఆ ధనవంతుడు కూతురును చూసిన హీరో టోనీ కిక్ ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెను ఇష్ట పడతాడు. కానీ ఆమె మాత్రం ఇష్టపడదు. ఇది ఒక రకంగా వన్‌సైడ్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. చివరగా కొన్ని ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో చోటు చేసుకుంటాయి. ఈ వీడియో పూర్తిగా చూస్తేగాని మనకు కథ అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పాటను చూడండి. లింక్ ఇచ్చాము. పాటను కూడా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Song | Teri Meri Katha |
Produced By | Annepaka Ashok Kumar, Vali |
Lyrics- Srceenpaly- Concept – Direction | Bullet Bandi Laxman |
Music | Kalyan Keys |
Singer | Ram Adnan |
Cast | Tony Kick , Yeshwanth,Pooja, Vaishnavi Sony, Bullet Bandi Laxman, Munna {anu tunes}, |
DOP – Editing – DI | Janatha Bablu |
Asst Cam | Raghu lavudya |
Making | MohanBala Karanam |
Youtube video | link |
Teri Meri Katha Lyrics
ఓ తేరి మేరీ కథ
రాసిండు దేవుడు కదా
ఆయనకేం తెలుసు నా బాధా
ఓ తేరి మేరీ కథ
ఒకటయ్యే పెళ్లితో కదా
నీకేం తెలుసు నా బాధా
ఎంత ప్రేమించానో
ఎంత పూజించానో
నాకు తప్ప ఎవరికి తెలుసే
నువ్వు కోరుకుందే జరగనీ
నిన్ను కోల్పోతున్ననే
నువు సిన్నబోతే సూడలేనే
రాసుంటే నా రాతలో సీత
దాటవుగా నే గీసిన గీత
తెలిసుంటే నీ మనసున గోసా
పడబోదే నీ మీదనే ఆశ
ఓ తేరి మేరీ కథ
రాసిండు దేవుడు కదా
ఆయనకేం తెలుసు నా బాధా
నువ్వు నా తల్లో తలంబ్రాలు పోసి
కళ్ళలోకి సూడకుంటె సిగ్గనుకున్నా
నేను నీ జళ్ళో పూలు పెడుతుంటే
పక్కనెట్టి పోతే మొహమాటమనుకున్న
అల్లుకున్నవే ఆలుమొగలమై
తెలుసుకున్ననే నాపై మనసు లేదని
నోచుకోలేదనుకుంటా ఓ ఓ
రాసుంటే నా రాతలో సీత
దాటవుగా నే గీసిన గీత
తెలిసుంటే నీ మనసున గోసా
పడబోదే నీ మీదనే ఆశ
గుండె నిండ దుఃఖం దాచుకొని నేను
నీ పెళ్ళికౌతున్ననే సాక్షి సంతకం
బయటపడకుండా బాధ బిగబట్టి
పూలదండనైననే మీ ఇద్దరి జతకి
ఎందుకోనే నువ్వంటే పిచ్చి ప్రేమ
అందుకేనే అయిన జోకరు బొమ్మ
నన్ను చూసి నవ్వుతరేంజేస్తం ఓ ఓ
రాసుంటే నా రాతలో సీత
దాటవుగా నే గీసిన గీత
తెలిసుంటే నీ మనసున గోసా
పడబోదే నీ మీదనే ఆశ
Teri Meri Katha Mp3 Song :