Tenali Raman Short Stories | తెనాలి రామలింగడు కృష్ణదేవ రాయల కొలువులో చేరిన తొలి రోజులవి. రాజుగారి సభాభవనం ముందు ఉండే ద్వారపాలకులు లంచం ఇవ్వనిదే ఎవరినీ ఎంత ముఖ్యమైన పనిమీద వచ్చినా రాయల దర్శనానికి అనుమతించడం లేదని రామ లింగడి దృష్టికి వచ్చింది. అందులో నిజానిజాలు తెలుసుకోవడానికి ఓ రోజు మారు వేషంలో సభా భవనానికి వెళ్లాడు. కానీ ద్వార పాలకుడు అతడిని లోనికి వెళ్లనీయలేదు. ‘రాజు గారే నన్ను బహుమతి తీసుకోవడానికి రమ్మని పిలిచారు’ అని అబద్ధం చెప్పాడు రామలింగడు. వెంటనే భటుడు రామలింగణ్ని లోనికి పంపించడానికి ఒప్పుకున్నాడు కానీ బదులుగా బహుమతిలో సగం తనకు ఇవ్వాలని షరతు పెట్టాడు. అందుకు సరేనన్నాడు రామలింగడు(Tenali Raman Short Stories).
తర్వాత మరో ద్వారం దగ్గర ద్వారపాలకుడు అడ్డుకున్నాడు. ‘నన్ను వెళ్లనివ్వు, నాకు బహుమతి ఇస్తానని రాజు రమ్మన్నారు’ అని చెప్పాడు రామ లింగడు. అయితే నాకేంటి లాభం? అని అడిగాడు భటుడు. సగం వాటా నీకిస్తాను అంటూ ముందుకు పోసాగాడు రామలింగడు. మరిచిపోవు కదా అంటూనే రామలింగణ్ని వెళ్లనిచ్చాడు ఆ భటుడు. ‘ఓహో మీకు సగం వాటా కావాలా’ అని అనుకుంటూ వేషం తీసి లోపలికి వెళ్లిన రామలింగడికి ఎదురుగా ప్రదర్శన ఇస్తున్న నాట్యకత్తెలు కనిపించారు. ప్రక్కన ఉన్న ఓ కర్ర తీసుకొని వారిని కొట్టసాగాడు.
దాంతో రాజుకి కోపం వచ్చి ‘ఏం రామలింగా, హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు’, నీకు వంద కొరడా దెబ్బల శిక్ష అమలు చేయాల్సిందిగా పక్కనే ఉన్న భటుల్ని ఆదేశించాడు. ‘రాజా ఆగండి ఆగండి.’ ఇందులో సగం సగం వాటా తీసుకోవడానికి ఇద్దరు మిత్రులు ఉన్నారు. అని జరిగిందంతా రాజుకు చెప్పాడు. రాజు ఆ ఇద్దరు ద్వారా పాలకుల్ని పిలిపించి ‘రాయల పాలనలో లంచమా? అదీ రాజభవనంలోనా! ఎంత ధైర్యం మీకు?’ అంటూ గద్దించి చెరో యాభయ్యేసి దెబ్బలు కానుకగా ఇవ్వండి వీళ్లకి అని భటులను ఆదేశించాడు. అంతే కాకుండా ఇంటి దొంగల్ని పట్టించి నందుకు రామలింగడికి బంగారు నాణేల్ని బహుమతిగా ఇచ్చాడు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!