DSP Sravanthi Roy: తెనాలి పట్టణంలో గంజాయి విక్రయ ముఠాలలోని వ్యక్తులు కొందరు పోలీసులకు దొరికిపో యారు. ఈ సందర్భంగా స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెనాలి డిఎస్పీ కె.స్రవంతి రాయ్ (DSP Sravanthi Roy) మాట్లాడారు.
పట్టణంలో గంజాయి విక్రయాలు రహస్యంగా జరుగుతున్నాయని, వీటిపై నిఘా పెంచి, గంజాయి ముఠా కోసం గాలిస్తున్నామని డిఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా పరిమి డొంకలోని దోనెపూడి వారి వీధిలో చేబ్రోలు జాన్ విక్టర్ అనే వ్యక్తితో పాటు, ఐతానగరంకు చెందిన చేబత్తిన అఖిల్, షేక్ బాషా, సీఎం చెంచు కాలనీకి చెందిన సింహాద్రి పూర్ణచందన్ అనే నలుగురు వ్యక్తులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సంచరిస్తుండగా సమాచారం అందిందన్నారు.
DSP Sravanthi Roy: గంజాయి ముఠా అరెస్టు
టూ టౌన్ CI ఎస్.వెంక్రటావు, ఎస్సై బి.శివరామయ్య దాడులు జరిపి అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి దగ్గర ఒక్కొక్కరి నుండి పావు కిలో చొప్పున మొత్తం ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వేము నవీన్ వూరఫ్ కిల్లర్ అనే వ్యక్తి వద్ద నుండి ఈ గంజాయి కొనుగోలు చేస్తుంటారని విచారణలో తేలిందన్నారు. పట్టు బడ్డ గంజాయిని రూ.5000 లకు కొని 20 గ్రాముల చొప్పున పొట్లాలు కట్టి విడిగా అమ్ముతుంటారని అన్నారు.
దీని విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందన్నారు. వేము నవీన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామన్నారు. ఎక్కడైనా గంజాయి బ్యాచ్ ఉన్నట్టు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ స్రవంతి రాయ్ కోరారు. సమావేశంలో సీఐ ఎస్.వెంకటరావు, ఎస్సై బి.శివరామయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.