tenali crime news | వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మర్మాంగాలను కోసిన ఘటన గుంటూరు జిల్లా tenaliలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఎస్.రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతడికి Ithangar చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. railway station సమీపంలోని ఓ లాడ్జిలో నివాసముంటూ కూలి పనిచేసే రామచంద్రారెడ్డి సోమవారం రాత్రి సదరు మహిళతో కలిసి మద్యం సేవించిన అనంతరం ఆమె నివాసముండే భవనంపై నిద్రిస్తున్నాడు.
తన తల్లితో వివాహేతర సంబంధంపై ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్న సదరు మహిళ కుమార్తె తన ప్రియుడితో కలిసి రామచంద్రారెడ్డితో గొడవ పడింది. ఈ క్రమంలో తన Lover సహకారంతో రామచంద్రారెడ్డి మర్మాంగాలను shaving bladeతో కోసేసింది. బాధితుడి కేకలు విన్న స్థానికులు రామచంద్రారెడ్డిని తెనాలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు GGHకు తరలించారు. తెనాలి టూటౌన్ CI కోటేశ్వరరావు ఆస్పత్రికి వచ్చి బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.