Temple Town:దేశ‌మే అబ్బుర ప‌డేలా కేసీఆర్ సార‌థ్యంలో వేగంగా వేములవాడ ఆల‌యం నిర్మాణ ప‌నులు

Spread the love

Temple Town: వేములవాడ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆల‌య విస్త‌ర‌ణ‌, పున‌ర్నిర్మాణం , అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌, దేవాదాయ‌శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో వేముల‌వాడ ఆల‌య‌, ప‌ట్ట‌ణాభివృద్ధి ప‌నుల‌పై మంత్రులు కేటీఆర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, వీటీడీఏ, దేవ‌దాయ శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. వేములవాడ ఆల‌య అభివృద్ధి ప‌నులు పురోగ‌తి, ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌పై మంత్రులు ఆరా తీశారు.

ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… దేశం అబ్బుర‌ప‌డే విధంగా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆల‌యాన్ని పునఃనిర్మిస్తు న్నార‌ని, వేముల‌వాడ ఆల‌యాన్ని అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించి ప‌నులు ప్రారంభించుకున్నామ‌న్నారు.

వీటీడీఏ, దేవ‌దాయ‌, పుర‌పాల‌క‌, రోడ్డు భ‌వ‌నాల శాఖ అధికారులు, స్త‌ప‌తిల‌ను భాగ‌స్వాముల‌ను చేసి వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. వేముల వాడ ఆల‌య అభివృద్ధితో పాటు స‌మాంత‌రంగా ప‌ట్ట‌ణాభివృద్ధి జ‌ర‌గాల‌ని, దానికి సంబంధించిన స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకుని అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌న్నారు.

రాజ‌న్న గుడితో పాటు, వేముల‌వాడ ప‌ట్ట‌ణ అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌కు దిశానిర్ధేశం చేశారు. వేముల‌వాడ ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌తో పాటు పుర ప్ర‌జ‌ల‌కు మెరుగైన సౌక‌ర్యాలు అందించ‌డ‌మే లక్ష్యంగా అధికారులు ప‌ని చేయాల‌న్నారు.

ఆల‌య అభివృద్ధిలో భాగంగా పుష్క‌రిణి, క‌ళ్యాణ‌క‌ట్ట‌, క‌ళ్యాణ మండ‌పం, క్యూ కాంప్లెక్స్‌, క‌ళా భ‌వ‌నం ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని చెప్పారు. టెంపుల్ టూరిజంలో భాగంగా వేముల‌వాడ‌ను స‌మ‌గ్ర అభివృద్ధి చేయాల‌ని, గుడి చెరువు చుట్టు నెక్లెస్ రోడ్డు నిర్మించాల‌ని, బోటింగ్ కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

వేముల‌వాడ‌, మిడ్ మానేరులో ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత మెరుగుప‌రిచేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. దీని వ‌ల్ల టెంపుల్ టూరిజం, టూరిజం రెండు అభివృద్ధి చెంద‌డం వ‌ల్ల స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు దొర‌కుతాయ‌ని తెలిపారు.

బద్ధిపోచ‌మ్మ ఆల‌య విస్త‌ర‌ణ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని, దానికి సంబంధించిన స్థ‌ల సేక‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని, విస్త‌ర‌ణ‌లో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి త‌గిన న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని పేర్కొన్నారు. వేముల‌వాడ‌లో ద‌శ‌ల వారీగా రోడ్ల విస్త‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని, బ్రిడ్జి నుంచి గుడి వ‌ర‌కు రోడ్డు విస్త‌ర్ణ ప‌నుల‌ను చేప‌ట్టాల‌న్నారు. ఎన్నో వ్య‌య ప్ర‌యాసాల‌కు ఓర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వేముల‌వాడ‌కు సామాన్య భ‌క్తులు వ‌స్తార‌ని, బ‌స్టాండు నుంచి ఆల‌యం వ‌ర‌కు ఉచిత ప్రయాణం క‌ల్పించాల‌ని, దానికి అనుగుణంగా మినీ ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సుల‌ను అందుబాటులోకి తెచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

వేములవాడ ప‌ట్ట‌ణ స‌మ‌గ్ర అభివృద్ధికి అవ‌స‌ర‌మైన అన్ని స‌హాయ సౌక‌ర్యాలు అందించాల‌ని పుర‌పాల‌క శాఖ అధికారుల‌కు సూచించారు. ప‌ట్ట‌ణాభివృద్ధి కోసం వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను సానుకూలంగా ప‌రిశీలించాల‌ని పుర‌పాల‌క శాఖ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. అంత‌కుముందు మంత్రి కేటీఆర్ కు వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ప్ర‌సాదాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి , ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్ అంద‌జేశారు.

ఈ స‌మావేశంలో వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్‌, పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్‌, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్‌, క‌లెక్ట‌ర్ కృష్ణ భాస్క‌ర్‌, వీటీడీఏ వైఎస్ ఛైర్మ‌న్ పురుషోత్తం రెడ్డి, వేముల వాడ ఈవో కృష్ణ ప్ర‌సాద్‌, మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ రామ‌తీర్థ‌పు మాధ‌వీ రాజు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Etela Rajender press meet: హుజూరాబాద్ ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేనిది: ఎమ్మెల్యే ఈటెల‌

Etela Rajender press meet హుజూరాబాద్: నా చ‌ర్మం ఒలిచి, వాళ్ల‌కు చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ Read more

Insects : రాకాసి కీట‌కాల స‌మూహం! ఇబ్బందులు ఎదుర్కొన్న వాహ‌న‌దారులు

Insects : రాకాసి కీట‌కాల స‌మూహం! ఇబ్బందులు ఎదుర్కొన్న వాహ‌న‌దారులు Insects : అక‌స్మాత్తుగా వేల సంఖ్య‌లో కీట‌కాల స‌మూహం ఎక్క‌డ నుంచి వ‌చ్చిన‌వో తెలియ‌దు కానీ Read more

Iftar in Khammam: ఇఫ్తార్‌లో పాల్గొన ర‌వాణా శాఖా మంత్రి

Iftar in Khammam | మ‌త‌సామ‌ర‌స్యానికి కాపాడ‌టంతో పాటు ముస్లీంల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంద‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి Read more

Telangana Rashtra Samithi: రేపు టిఆర్ఎస్ పార్టీ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశం

Telangana Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు(kcr) సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో టిఆర్ఎస్ పార్టీ శాస‌న‌స‌భ ప‌క్ష సమావేశం Read more

Leave a Comment

Your email address will not be published.