Telugu Ugadi 2022: విశ్వ విశ్వాసంలో సృష్టికర్తకి ఒక రోజు పూర్తియ మరియొక కొత్త రోజు ప్రారంభమైతే దాన్ని ఉగాది అంటారు. విశ్వాసాల నుండి, విశ్వసత్యాల నుండి దూరమవుతున్న మనకు సంవత్సరాలం పూర్తయి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజుని ఉగాది అంటాం. నిత్య జీవిన సమరంలో అలిసిసొలసి పోయిన మనం ఆయుష్యు, ఆరోగ్యం, ఆనందం అభిలాషిస్తూ చేసుకునే చిరు సంబరం ఉగాది. వచ్చే వచ్చే ఉగాదిలా ఈ ఉగాది కాకూడదని, మళ్లీ వచ్చే ఉగాదిలా ఈ ఉగాది వెళ్లిపోకుండా కొంత శాంతిని, మరికొం ప్రశాంతిని, ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సామాన్య ఆకాంక్షకి ప్రతి రూపం ఈ ఉగాది ఆరంభం(Telugu Ugadi 2022) ఉగాది పచ్చడి!.
ఈ సృష్టి పంచ భూతాత్మకం అంటే పృధివి. అంటే భూమి, అగ్ని, తేజస్సు, వాయువు, ఆకాశం వీటి అంశాలతో వివిధ ప్రమాణాల కలయిక ఈ సకల జీవరాశి. అందులో ఒక ప్రత్యేక పరిమాణాస్థితి మన మానవ జన్మ. మనం తీసుకునే ఆహారం ఆరు రుచల సమాహారం. మధురం అంటే తీపి, ఆమ్లం అంటే పులుపు, లవణం అంటే ఉప్పు, కటం అంటే చేదు, తిక్త అంటే వగరు. కషాయ అంటే కొంచెం ఘాటు. ఇలా ఆరు రుచులు మనం తినే వివిధ పదార్థాలతో ఉంటాయి.
అలాగే భూమి, అగ్ని కలిస్తే పులుపు, నీరు, అగ్ని కలిస్తే ఉప్పు, వాయువు, అగ్ని కలిస్తే కటురసం, వాయువు, ఆకాశం కలిస్తే తిక్తరసం. వాయువు, భూమి కలిస్తే కషాయ రసం తయారవుతాయి. గడిచిన సంవత్సరమంతా నిరంతరం పనిచేసిన మన శరీరాన్ని శుభ్రపరుచుకొని, తిరిగి పుష్టిని ఆపాదించినవోన్మేషాన్నిచ్చే పచ్చడి ఉగాది పచ్చడి.
ఉగాది పచ్చడి ఎలా ఉపయోగపడుతుంది?
మధురసం కలిగిన పదార్థాలు వాత, పిత్త, హరం అంటే నరాల శక్తిని, జీవశక్తిని, బలాన్ని శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆమ్లరసం, వాతహరం హృదయానికి మంచిది. ఆకలిని పుట్టిస్తుంది. ఎక్కువుగా పులుపు తింటే అది శుక్రనాశకముగా పనిచేస్తుంది. అలాగే ఉప్పు రుచి కలిగిన పదార్థాలు ఆకలిని కలిగిస్తాయి. జీర్ణం చేస్తాయి. ఎక్కువ తింటే గుండెకు మంచిది కాదు. శుక్రనాశకం, కటురసం శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. శరీరంలో తయారై వున్న క్రిములను నాశనం చేస్తుంది.
తిక్తరసం జీర్ణ శక్తిని పెంచుతుంది. విషకరం అంటే శరీరంలో టాక్సిన్స్న తగ్గిస్తుంది. కషాయరసం రక్తాన్ని శుభ్రపరుస్తుంది. చర్మానికి హితకరం. అందుకే మనం తినే ఆహారంలో కూడా ఎటువంటి రసాలు కలిగింది, ఎప్పుడు తీసుకోవాలో ఆయుర్వేద ఆచార్యులు ప్రతిపాదించారు. భోజనంలో ముందు, మధ్యలో, చివర క్రమంగా మధుర ఆమ్ల లవణ తిక్త కటు కషాయ రసాలని సేవించాలి మనం. ఇలాంటి మనకి హితకరమైన విషయాలని జ్ఞప్తికి తెచ్చుకుని ఆచరించడం ఉగాది పండుగ ఉద్ధేశ్యం. ఇలాంటి ఆరు రుచులు సమ్మేళనంలో శరీరాన్ని శోధించి తిరిగి ఉత్సహాంగా ఉండటానికి కావల్సిన శక్తినిచ్చే అమృత తోరక ఈ పచ్చడి.
అదీ మనం చక్కగా నలుగు పెట్టకుని, తలంటుపోసుకొని పరగడుపున తినాలి. ఈ అమృతధారిని, కాలగమనాన్ని బట్టి 12 మాసాల వత్సరం పూర్తయి మరో నూతన సంవత్సరం తొలి మాసమైన చైత్యమాసంలోని తొలి తిథియైన పాఢ్యమి రోజే ఈ ఉగాది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన మానవులకి కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తాడు. కాలస్వరూపుడు, కాలానికి ఆధీనుడు అయిన ఈశ్వరుని స్మరించి మంచి భావనలతో ఈ ఉగాది ఆరంభించాలి.
ఉగాది పచ్చడి ఎలా చెయ్యాలి!
వెండి గిన్నెలో కాని, కళాయి పూసిన ఇత్తడి గిన్నెలో కాని గాజు గిన్నెలో కాని చింతపండు నానేసి పిండి పిప్పి తీసి అందులో వొలిచిన వేపపువ్వు, కొత్తగా వచ్చిన మామిడి కాయముక్కలు, చెరకు ముక్కలు, కొద్ది అరటిపండు ముక్కలు, బెల్లం కలిపి తయారు చేసుకోవాలి.కొంచెం పల్చగా ఉండటానికి కొద్దిగా నీళ్లు కలుపు కొని సూర్యునికి, ఇంటి దేవతలకు నివేదించి మనం తీసుకోవాలి. ఇది ఆయుష్కరం ఆరోగ్య ప్రదం,శోధనకరం అమృతతుల్యమైన పదార్థం.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత!
చింత పండును Tarindas Indica అంటారు. ఇది మధుర ఆమ్ల రసాలు కలిగి జీర్ణమైన తర్వాత శరీరానికి వేడి పుట్టిస్తుంది. ఆకలిని పెంచుతుంది. నాలుకకు రుచినిస్తుంది. అజీర్ణం, వాపు, నరాల వ్యాధులు, లివర్‌కి సంబంధించిన వ్యాధులని నయం చేస్తుంది. వేపని అరిష్ట అని కూడా అంటారు. అంటే దీనివల్ల ఏ అశుభం జరగదు. దీని ఆకుల నుండి వీచే గాలి మనకి వ్యాధిని తెచ్చే వైరస్‌ను దూరంగా ఉంచుతుంది. తిక్త కషాయరసాలు కలిగి క్రిములని బయటకు పంపి శరీరం లోపల శ్రోతస్సుల్ని శుభ్రపరుస్తుంది. చర్మానికి మంచిది, షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. మామిడి తీపి, వగరు, పులుపు కలిగి కాయ. పండితే తీపి, లేతగా పులుపు కలిగిన అమృత ఫలం. గుండెకు మంచిది. మల మూత్రాల దోషాలను శమింపజేస్తుంది. బలాన్ని కల్గిస్తుంది.

అరటిపండును Mosa Para Disisa అని అంటారు. తీయనిదై చలువచేసే మంచి ఆహారం. కడుపులో మంటని తగ్గించి, గ్యాస్‌ను తగ్గించి, స్త్రీలలో వైట్ డిస్చార్జిని తగ్గించి ఆరోగ్యాన్ని అందించే అమృత ఫలం. చెరకు భగవంతుడిచ్చిన ప్రకృతి వరం. దీని మూలం తియ్యగా ఉండి కణుపులలో ఉప్పగా ఉండే విచిత్రం. దాహాన్ని తగ్గించి రుచిని కలిగిస్తుంది. బలకరం, తల్లిపాలు లేని తల్లులకు సహాజమైన స్తన్యవృద్ధిని చేస్తుంది. మరి బెల్లం వాతహరం అంటే నరాలలో కదలికని క్రమపరుస్తుంది. పాత బెల్లం మంచిది. దీన్ని ఉసిరికాయతో తింటే రక్తాన్ని, లివర్ జబ్బులని నయం చేస్తుంది. శొంఠితో కలిపి తింటే కీళ్ల నొప్పులని తగ్గిస్తుంది.
ఇలాంటి అద్భుత గుణాలు కలిగిన ఉగాది పచ్చడితిని, దైవదర్శనం, పెద్దల ఆశీర్వచనం పొంది నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ జీవించాలి మనం శరీర ఆరోగ్యంతో నిండైన మనసుతో ఈ విరోధి నామ సంవత్సరం మనకు కాదు విరోధి! మన బయట శత్రువులకి లోపల శత్రువలకి మన ఆరోగ్యాన్ని కబలించే విరోధి కాకుండా మనకు శాంతిని, ప్రశాంతిని, మంచి జీవనాన్ని ఇవ్వాలని ఆకాంక్షిద్దాం.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ