Telugu Short Stories:పారిపోయి వ‌చ్చిన Donga చివ‌ర‌కు ఏమైంది?

Telugu stories

Telugu Short Stories | వీధి త‌లుపు చ‌ప్పుడు కావ‌డంతో, వంట గ‌దిలో ఉన్న ర‌మ వ‌చ్చి త‌లుపు తీసింది. అప్ప‌టికే బాగా చీక‌టి ప‌డింది. అవ‌త‌ల ఉన్న మ‌నిషి ఆమెను త‌సుకుని లోప‌లికి వ‌చ్చి, చ‌ప్పున త‌లుపు మూశాడు. అరిచా వంటే పీక నులిమేస్తాను. అన్నింటికీ తెగించాను. జైలు నుంచి పారిపోయి వ‌స్తున్నాను. అన్నాడు దొంగ క‌ర‌కుగా. వీధి వెంట న‌లుగురు మ‌నుషులు పెరిగెత్తిన శ‌బ్ధం అయ్యింది. వాళ్లు దొంగ‌ను త‌రుముకుంటూ వ‌స్తున్న ర‌క్ష‌క భ‌టులు. వాళ్ల‌ను దూరం కానిచ్చి, ర‌మ న‌వ్వుతూ చెర‌సాల‌లో సుఖంగా కాలం గ‌డ‌ప‌క‌, ‘ఏం పోగుచేసుకుందామ‌ని పారిపోయి వ‌చ్చావు?’ అని దొంగ‌ను అడిగింది.

Telugu Short Stories

దొంగ కోపంగా ఆ విష‌యం నీకు అవ‌న‌స‌రం. ఇంట్లో ఇంకా ఎవరు ఉన్నారు? అని అడిగాడు. నీకేమీ భ‌యం లేదు. నేను ఒంట‌రిగానే ఉన్నాను. వంట స‌గం అయింది. వంట గ‌దిలోకి వ‌స్తావా? అంటూ దారి తీసింది ర‌మ‌. దొంగ ఆమె వెనుక‌నే వంట‌గ‌దిలోకి వెళ్లి, ఆమె వేసిన పీట మీద కూర్చున్నాడు. ర‌మ వంకాయ‌లు త‌రుగుతూ క‌ళ్ల నీళ్లు పెట్టుకుని, కొంగుతో తుచుడుకున్న‌ది. నేను నిన్ను ఏమీ చెయ్య‌లేదే? ఎందుకు క‌న్నీళ్లు? అని దొంగ అడిగాడు. నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వ‌చ్చాడు. వాడు ఆవేశంతో ఎవ‌రినో కొట్టి, ఖైదీ అయ్యాడు. అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వ‌చ్చాడు. వ‌చ్చిన క్ష‌ణం నుండి వాడికి శాంతి లేదు. నిద్ర లేదు.

ఇల్లు క‌ద‌లాలంటే భ‌యం. బ‌య‌ట ఏ చ‌ప్పుడు వినిపించినా ర‌క్ష‌క‌భ‌టులు వ‌స్తున్నార‌ని భ‌యం. పిచ్చివాడిలా త‌యారయ్యాడు. శిక్ష పూర్తిగా అనుభ‌వించి వ‌స్తే ఇలాంటి భ‌యాలు ఉండ‌వు. ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించ‌వ‌చ్చును. ఆ మాట నేను చెప్పాను. వాడు విన‌లేదు. ప‌ది రోజుల పాటు ఇంట్లోనే అజ్ఞాత‌వాసం చేశాడు. ప‌దో రోజు రాత్రి హ‌ఠాత్తుగా ర‌క్ష‌క‌భ‌టులు వ‌చ్చారు. భ‌యంతో ఆలోచించ‌కుండా మేడ మీది నుంచి దూకేసి, దెబ్బ‌లు త‌గిలి, రెండు రోజుల త‌ర్వాత చ‌నిపోయాడు. అంటూ ర‌మ క‌థ ముగించింది. దొంగ ఆమెను చూసి జాలిప‌డుతూ, ‘గొంతు త‌గ్గించు! ఎవ‌రైనా రాగ‌ల‌రు.’ అన్నాడు. వంట అయింది. భోజ‌నం చేస్తావా? అన్న‌ది ర‌మ‌.

దొంగ‌కు తినాల‌ని ఉన్న‌దిగానీ, సందేహించాడు. ఇందులో విషం క‌ల‌ప‌లేదులే. నీ ఎదటేగా వంట చేశాను. అంటూ ర‌మ దొంగ ముందు అన్నం, కూర‌లు వ‌డ్డించింది. వాడు భోజ‌నం చేస్తుంటే ర‌మ‌, చూడ‌బోతే మంచివాడి విలాగున్నావు. ‘చెర‌సాల‌లో ఎలా ప‌డ్డావు?’ అని అడిగింది. దొంగ ఇలా చెప్పాడు. నా త‌ల్లిదండ్రులెవ‌రో నాకు తెలీదు. ఒక అవ్వ న‌న్ను పెంచి, పెద్ద చేసింది. న‌న్ను గారాభంగా పెంచ‌టానికి తాను అష్ట‌క‌ష్టాలు ప‌డింది. ఆమె పోయాక నా క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. నాకు చ‌దువు లేదు. మా ప‌ల్లెలో ప‌నిలేక ప‌ట్నం వ‌చ్చాను. ఏ ప‌నీ ఇచ్చిన‌వారు లేరు. నాలుగు రోజులు తిండిలేదు. ఆక‌లి బాధ‌కు తాళ‌లేక‌, ఒక వ్యాపార‌స్థుడి చేతిలో ఉన్న సంచీ లాక్కుని, పారిపోయి ప‌ట్టుబ‌డ్డాను. రెండు నెల‌లు శిక్ష ప‌డింది. అలానా పాపం. మ‌రి ఇప్పుడు పారిపోయి ఎందుకు వ‌చ్చావు? అని ర‌మ అత‌న్ని అడిగింది.

అక్క‌డ అడ్డ‌మైన చాకిరీ చెయ్యాలి. పెద్ద ఎత్తున వంట‌లు చెయ్యాలి. తోట ప‌ని చూడాలి. బ‌ట్ట‌లు పిండాలి. చాప‌లూ, దుప్ప‌ట్లూ నేయాలి. బ‌ట్ట‌లు కుట్టాలి. ఇలా ఎన్నోర‌కాల ప‌నులు. అవ‌న్నీ చేసే ఓపిక నాకు లేదు. అన్నాడు దొంగ విసుక్కుంటూ. ర‌మ న‌వ్వి. బ‌య‌ట ప‌ని దొర‌క‌లేద‌ని, దొంగ‌త‌నం చేసి, చెర‌సాల‌కు వెళ్లావు. అక్క‌డ ప‌ని ఎక్కువ అని దొంగ‌త‌నంగా పారిపోయి వ‌చ్చావు. ఇప్పుడు ఏం చేస్తావు? అని అడిగింది. దొంగ జ‌వాబు చెప్ప‌లేక త‌ల దించుకున్నాడు. ర‌మ మ‌ళ్లీ ఇలా అన్నది. ఇప్ప‌టి నుంచీ నీకు న‌ర‌క‌బాధ‌లు ప్రారంభ‌మవుతాయి. నిద్రాహారాలుండ‌వు. భ‌యం నిన్ను నీడ‌లా అంటిపెట్టుకుని ఉంటుంది.

ఇప్పుడు నువు ఎలా బ్ర‌తుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీ కిప్పుడు జైలులో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. పారిపోయివ‌చ్చి నీ ఖైదు శిక్ష‌ను పెంచుకున్నావు. అంతే ఆ చెర‌సాలలోనే ఏ వంట‌లు చెయ్య‌డంలోనే, బ‌ట్ట‌లు కుట్ట‌డంలోనో, దుప్ప‌ట్లు నెయ్య‌డంలోనో, తోట‌ప‌నిలోనో ప్రావీణ్యం సంపాదించి ఉంటే, విడుద‌ల అయివ‌చ్చాక‌, నీ బ‌తుకు నువు స్వ‌తంత్రంగా గౌర‌వంగా బ‌తికే మార్గం దొరికేది. అక్క‌డ నీకు శిక్ష‌తోబాటు ఏదో వృత్తిలో శిక్ష‌ణ కూడా దొర‌కుతుంది. నువు చాలా తెలివి త‌క్కువ ప‌ని చేశావు. పారిపోయి వ‌చ్చావు అని అన‌డంతో దొంగ‌కు క‌ళ్లు తెరుచుకున్నాయి. అత‌ను తాను చేసిన పొర‌పాటు గ్ర‌హించాడు.

నిజ‌మే! పొర‌పాటు జ‌రిగింది. దీన్ని దిద్దుకోవ‌డ‌మెలాగ‌? అని అత‌ను ర‌మ‌ను అడిగాడు. మించిపోయిందేమీ లేదు.నీ అంత‌ట నీవే చెర‌సాల‌కు వెళ్ళి, ప‌ట్టుబ‌డు. అలా చేస్తే నిన్ను దండించ‌రు. కొద్దిగా నీ శిక్ష పెర‌గ‌వ‌చ్చు. ప‌ని నేర్చుకోవ‌డానికి అది మంచిదే అన్న‌ది ర‌మ‌. దొంగ సంతోషంగా సొంత చెల్లెలు లాగా మంచి స‌ల‌హా చెప్పావు. నీ రుణం తీర్చుకోలేను. వ‌స్తా! అని వెళ్లి పోయాడు. దొంగ వెళ్లిన కొంత‌సేప‌టికి మ‌ళ్లీ త‌లుపు చ‌ప్పుడు వినిపించింది. ఈసారి వ‌చ్చిన‌వాడు ర‌మ తండ్రి. ఎప్పుడూలేంది. ఇంత ఆల‌స్యం అయిందేం నాన్నా? అని ర‌మ తండ్రిని అడిగింది. చెర‌సాల నుంచి ఒక దొంగ పారిపోయాడు. అందుకే ఆల‌స్యం అయింది. అన్నాడు తండ్రి.

ఆయ‌న చెల‌సాల అధికారి. మీరు ఖైదీల‌ను చూసే తీరు అలా ఉంటుంది. చెర‌సాల‌లో కేవ‌ల‌మూ ఖైదీల‌ను శిక్షించటానికే కాదు. వాళ్ల‌లో ప‌రివ‌ర్త‌న క‌లిగించేవిగా కూడా ఉండాలి. మీ చెర‌సాల నుంచి పారిపోయిన దొంగ మ‌న ఇంటికే వ‌చ్చాడు. నేను ఆ దొంగ‌లో ఉన్న దొంగ లక్ష‌ణాల‌ను పార‌దోలాను. అందుకోసం ఒక అన్న‌య్య‌ను కూడా క‌ల్పించాను. అంటూ ర‌మ జ‌రిగన‌తంతా చెప్పిది. భేష్‌! చెర‌సాల అధికారి కూతురుని అనిపించుకున్నావు. అతను చెర‌సాల చలో చేరాడో లేదో చూసి వ‌స్తాను అంటూ ఆయ‌న లేచాడు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *