Telugu Raithu Work Shop | కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్ఆర్ కన్వెన్షన్‌లో టిడిపి తెలుగు రైతు వర్క్‌షాప్ వివిధ జిల్లాల ప్రతినిధులతో గురు రెండో రోజు కోలాహలంగా ప్రారంభమైంది. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యకర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో కలిసి స్థానిక నాయకులు టిడిపి కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు (Telugu Raithu Work Shop) అర్పించారు.
రైతులు పోరాటం వర్థిల్లాలి..జై అమరావతి…అమరావతి ప్రజా రాజధాని అంటూ ఇచ్చిన నినాదాలతో హనుమాన్ జంక్షన్ మార్మోగింది. రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలి అనే నినాదంతో అరటి గెలలు, చెరకు గెడలతో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ఆహుతులను ఆకట్టుకుంది. 13 జిల్లాలను 5 జోన్ల వారీగా విభజించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు.
నిన్న జరిగిన తొలిరోజు వర్క్ షాప్ ప్రారంభానికి ముందు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళ్లుర్పించి, ఇటీవల మరణించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకట్రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్‌లో కింజారపు అచ్చెన్నాయుడు ప్రసంగించారు.
సీఎం జగన్ రెడ్డి పాలనలో ప్రతి రైతు వ్యవసాయం పరంగా రూ.75 వేల ధరల పెరుగుదల, దుబారా, అవినీతి కారణంగా తెచ్చిన అప్పులతో రూ.1,25,000 కలిపి మొత్తం రెండు లక్షల భారం పడిందన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగానికి రూ.67 వేల కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్వీకరిస్తే జగన్ రెడ్డి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తూ ఉన్నారని రైతు భరోసా, పంట నష్ట పరిహారం, సున్నా వడ్డీ రుణాలు, ధాన్యం కొనుగోలు, యంత్ర పరికరాలు పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సీఎం జగన్ కలలో లేచి రాష్ట్ర శాసనసభనుర రద్దు చేస్తున్నట్టు లెటర్ ఇచ్చినా ఆశ్చర్య పడవద్దని హెద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం హయాంలో కనీసం యూరియా కూడా దొరకడం లేదని మండిపడ్డారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ