Telugu podupu kathalu answers | చిన్నప్పుడు మీరు పొడుపు కథలు మీ నాయనమ్మ వద్దనో, మీ తాతయ్య వద్దనో చెబుతుంటే వినే ఉంటారు కదా!. ఆ పొడుపు కథ విప్పడానికి చాలా తీవ్రంగా ఆలోచిస్తాం. చివరకు నా వల్ల కాదు నువ్వు చెప్ప నాయనమ్మ, తాతయ్య అంటూ మారాం చేసే ఉంటాం కదా!. ఇప్పుడు ఉన్న బీజీ లైఫ్లో పొడుపు కథలే మరిచిపోయాం. కనీసం మన పిల్లలకు కాలక్షేపం కోసమైనా, జ్ఞానం కోసమైనా వాటిని చెప్పే ఆలోచన బహుశా ఎవ్వరూ చేయడం లేదు. కానీ రానురాను ఆధునిక పోకడలు బోరు కొడుతున్నాయి. మళ్లీ పాద పద్థతులను పాటిస్తున్నారు అక్కడక్కడ. కాబట్టి మీకు తెలిసిన, తెలియని కొన్నిపొడుపు కథలు క్రింద ఇచ్చాము. వాటిని మీరు చదవండి. మీ పిల్లలకు పొడుపు కథలు వేయండి. జవాబులు పేజీ చివరిలో ఉంటాయి. గమనించగలరు.
Telugu podupu kathalu answers
1.నీళ్లు నుంచి వస్తుంది. నీకు నాకూ రుచిస్తుంది? ఇంతకీ ఏమిటది?
2.ఆకాశంలో పాములు ఏంటవి?
3.ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది ఏంటది?
4.వీధిరాజుకు కొప్పుది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపులేదు ఏంటది?
5.ఆరు ఆమడల నుండి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏంటది?
6.తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, చేతితో చల్లుతాం, నోటితో ఏరుతాం ఏమిటవి?
7.ముక్కు మీదకెక్కు, ముదుర చెక్కుల నొక్కు, టక్కు నిక్కుల సొక్కు జారిందో పుటుక్కు ఏమిటది?
8.తోలు నలుపు, తింటే పులుపు, ఏంటో అది?
9.కుడితి తాగదు, మేత మెయ్యదు, కానీ కడివెడు పాలు ఇస్తుంది. ఏంటది?
10.సన్నటి స్థంభం, ఎవ్వరూ ఎక్కలేరు, దిగలేరు ఏంటది?
11.అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు ఏంటది?
12.ఇంట్లో మొగ్గ బయటకొస్తే పువ్వు?
13.కాళ్ళున్నా పాదాలే లేనిది ఏంటది?
14.చక్కనమ్మ చిక్కినా అందంగా ఉంటుంది? ఏంటది?
15.పచ్చని పాముకు తెల్లని చారలు? ఏంటది?
16.నాలుగు కర్రల మద్య నల్లరాయి? ఏంటది?
17.చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ? ఏంటది?
18.అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను వంటినిండా గాయాలు కడుపునిండా రాగాలు
19.ఈ ప్రపంచలోని వారందరూ నా బిడ్డలే కాని అమ్మా! అని నన్నెవరు పిలవరు ఏం చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటూ పోవాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా నా మీదే..నేనెవర్ని?
20.తెల్లటి శనగలలో ఒకటేరాయి, చేతితో చల్లడం నోటితో ఏరుకోవడం ఏంటది?
21.రాజుగారి తోటలో రోజాపూలు చూచేవారేగాని లెక్కవేసేవారు కాదు ఏమిటవి?
22.జీడివారి కోడలు సిరిగల వారికి ఆడపడుచు వయసులో కులికే వయ్యారి వైశాఖమాసంలో వస్తుంది.
23.కిరు కిరు తలుపులు కిటారు తలుపులు వెయ్యంగ వెయ్యస్తవి గాని తియ్యంగా తియ్యరావు ఏంటవి?
24.అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్క లాడింది.
25.పొంగ బోడది రాంగ జుట్టుది ఏంటది?
26.చీకటింట్లో జడల దయ్యం ఏమిటది?
1.జవాబు: సాల్ట్, 2.జవాబు: పొట్లకాయలు, 3.జవాబు:దువ్వెన, 4.జవాబు:కొబ్బరికాయ, 5.జవాబు:పుట్టగొడుగుల కూర, 6.జవాబు:పుస్తకంలో అక్షరాలు, 7.జవాబు:కళ్లజోడు, 8.జవాబు:చింతపండు, 9.జవాబు:తాటిచెట్టు, 10.జవాబు:సూది, 11.జవాబు:వేరుశనగ కాయ, 12.జవాబు:గొడుగు, 13.జవాబు:కుర్చీ, 14.జవాబు:సబ్బు, 15.జవాబు:పొట్లకాయ, 16.జవాబు:పలక,17.జవాబు:కజ్జికాయ,18.జవాబు:మురళి – ఫ్లూట్, 19.జవాబు:భూమి 20.జవాబు:పుస్తకం, 21.జవాబు:చుక్కలు,22.జవాబు:మామిడి పండు, 23.జవాబు:ముగ్గు, 24.జవాబు:చిల్ల కవ్వ, 25.జవాబు:పేలాలు, 26.జవాబు:ఉట్టి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!