Telugu Moral stories | ఒక నాడు రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఏదో మాట్లాడుకుని కోవెల కుంట్లలో బస్ ఎక్కడి తాడిపత్రి(Tadipatri)కి వెళ్లసాగారు. వాళ్లిద్దరిలో ఒకరి వద్ద ఒకరి వద్ద డబ్బు ఉన్నదన్న సంగతి ఎలాగో ఇద్దరు దొంగలకు తెలిసి అదే బస్ లోకి ఎక్కి కూర్చున్నారు. రామయ్య వద్ద డబ్బు ఉన్నదో, లేక సోమయ్య వద్ద డబ్బు ఉన్నదో దొంగలిద్దరికీ తెలియదు.
సోమయ్య నిమిషానికి కొకసారి అటు ఇటు చూస్తూ తన చేతిని చినిగిన లోపలవున్న జేబు మీదికి పోనిచ్చి తీస్తుండటం చూచిన దొంగలు డబ్బు ఎవరి వద్ద ఉండేది సులభంగా తెలుసుకున్నారు. వెంటనే దొంగలిద్దరూ కత్తులను తీసి సోమయ్య గొంతువద్ద ఆనించి ”నీ వద్ద ఉన్నదంతా ఇచ్చేయ్. లేకపోతే …”అని బెదిరించారు. అందుకు సోమయ్య ”నేను బీదవాడను. నిమ్మకాయల వ్యాపారిని. నిమ్మకాయలు కొనడానికి తాడిపత్రికి పోవుచున్నాను. నన్ను ఒదిలి పెట్టండి.” అన్నాడు.
Telugu Moral stories
”అదంతా కుదరదు. డబ్బు ఇస్తావా? లేక చస్తావా?” అని దొంగలు ఇంకా గట్టిగా ఇక చేసేది లేక సోమయ్య తన జేబునుంచి డబ్బు మొత్తం ఐదువేలు తీసి ఇచ్చి కన్నీరు కార్చసాగాడు. దొంగలిద్దరూ నవ్వుకుంటూ ఉమ్మాయిపల్లె సమీపంలో లోనే బస్ దిగి ఎటో వెళ్లి పోయారు. తాడిపత్రి బస్ స్టేషన్లో బస్ దిగారిద్దరూ. సోమయ్యతో రామయ్య ”మొదట మనం మాట్లాడుకున్నట్టు నిజంగానే జరిగింది. నా వద్ద ఉన్న ఉన్న లక్ష రూపాయలను కాపాడటానికి నీవు ఆడిన నాటకం బాగుంది. నీ దగ్గర ఉన్నది పనికి రాని నకిలీ డబ్బు అన్న సంగతి దొంగలకు తెలియక దోచుకున్నారు. ఇంతకూ మనం ఇచ్చింది నా కూతురు పెళ్ళికి శిల్కు బట్టలు కొనడానికి కదా? ఈ సంగతి కూడా దొంగలకు తెలియదు.” అన్నాడు. ఇద్దరూ మురుగన్ శిల్క్ సెంటర్లోకి అడుగు పెట్టారు చాలా సంతోషంగా.
షేక్ హున్నూర్ (కోవెలకుంట్ల)
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ