Telugu love Story: ప్రేమ ఎంత మ‌ధురం ప్రియురాలు క‌ఠినం!

Telugu love Story: రెండేళ్ల ప్రేమ‌. ప‌రిస్థితులు అనుకూలించ‌క వ‌దులుకుంది అమ్మాయి. నేను మాత్రం కొత్త‌గా ప్రేమ‌లో (Telugu love Story)ప‌డ్డా అంటున్నాడు ఓ అబ్బాయి. ఇదేం విచిత్రం? అనుకుంటున్నారా? అయితే ఈ ల‌వ్ స్టోరీ చ‌ద‌వాల్సిందే!.

అంద‌రిలాగే నా ప్రేమ కూడా ఆక‌ర్ష‌ణ‌తో మొద‌లైంది. త‌ను మా వీధిలోనే ఉండేది. ఆమెను ఆక‌ట్టుకోవ‌ డానికి నేను చేయ‌ని జిమ్మిక్కులు లేవు. జోకుల‌తో న‌వ్వించేవాడ్ని. ఆక‌ట్టుకునే మాట‌ల‌తో క‌వ్వించే వాడ్ని. త‌ను ద‌గ్గ‌రుంటే మాట‌లు. దూర‌మైతే మెస్సేజ్‌లు. ఆ ధ్యాస‌లో ప‌డి గ‌డియారంలో ఏ ముల్లు ఎక్క‌డుందో మ‌ర్చిపోయా.

రోజురోజుకూ త‌న‌పై మోజు పెరిగిపోయేది. ఎంత‌లా అంటే ఎన్న‌డూ కాలేజీ ఎగ‌నామం పెట్ట‌ని నేను అరుదుగా క్లాసుల‌కు హాజ‌ర‌య్యేవాడ్ని. రేయ్‌..వెధ‌వా…చెడిపోతున్నావ్‌..ఇలాగైతే బాగుప‌డ‌వ్‌..నా తీరు గ‌మ‌నించి ముందే హెచ్చ‌రించారు లెక్చ‌ర‌ర్లు. ఆ మాట చెవికెక్కితేగా!. ఎవ‌రేం అనుకున్నా ఈ ప్రపంచంతో సంబంధ‌మే లేన‌ట్టు ప్ర‌వ‌ర్తించేవాళ్లం. మాకు మేమే లోక‌మైన‌ట్టు.. మా మాట‌లు మేమే వింటూ..మా ఊసులు మేమే చెప్పుకుంటూ మీతో మాకేం ప‌ని? అన్న‌ట్టుగా ఉండేవాళ్లం. రెండేళ్ల ప్రేమ‌లో క‌నీసం రెండువంద‌ల సార్లైనా ఐల‌వ్యూ చెప్పుకున్నాం. త‌నే ఫీలింగ్‌తో చెప్పిందోగానీ ప్రేమించిన అమ్మాయికి I LOVE YOU చెప్ప‌డం నాకు ఓ ఫ్యాష‌న్‌. అంతే.

Telugu love Story: వ‌చ్చే వారం అన్న‌య్య పెళ్లి. ప‌నులు చాలా ఉన్నాయ్‌. నువ్వు త‌ప్ప‌కుండా రావాల్రోయ్‌..ఆర్డ‌రేశాడు స్నేహితుడు. ఓ రోజు ముందే వాలిపోయా. మీలాగే మా అన్న‌య్య వ‌దిన‌ల‌దీ గాఢ‌మైన ప్రేమ‌. పెద్ద‌వాళ్ల‌ని ఒప్పించి ఒక్క‌ట‌వుతున్నారు. వివ‌రాలందించాడు. ఏడాది ప్రేమ‌కే పెళ్లితో ఏక‌మ‌వుతున్నారు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మాకెందుకు ఆ ఆలోచ‌న రాలేదంటావ్‌?.. నా ధ‌ర్మ‌సందేహం వాడి ముందుంచా. అవ‌స‌రాల కోసం ప్రేమిస్తే ప్రేమిస్తూనే ఉంటారు. జీవితాంతం ప్రేమ అవ‌స‌ర‌మ‌నుకువారే పెళ్లాడ‌తారు. అనేశాడు వేదాంతిలా. ఆ మాట నాకు తెగ న‌చ్చేసింది. అదే మాట ఆ రాత్రి నాకు నిద్దుర లేకుండా చేసింది.

Telugu love Story: తుఫాను చెల‌రేగింది ఇలా!

మ‌ర్నాడు ఉద‌యం ఎప్ప‌టిలాగానే నా ల‌వర్‌కి ఫోన్ క‌లిపా. ఈ సారి మాత్రం గుండెలో ఏదో తెలియ‌ని ఉద్వేగం. అర్జెంట్‌గా నిన్ను క‌ల‌వాల‌ని ఉంది అన్నా. ఇంట్లో ఎవ‌రూ లేరు వ‌చ్చేయ్‌మంది. క్ష‌ణాల్లో త‌న ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యా. వెంట‌నే త‌న‌ని అమాంతం గుండెల‌కు హ‌త్తుకొని ఐ ల‌వ్యూ (Telugu love Story) బంగారం అన్నా మ‌న‌ప్పూర్తిగా. మా ప్రేమ మొద‌లైన రెండేళ్ల‌లో ఏం చేయాల‌నుకుంటే అది చేశాం. క‌ల‌వాల‌నుంటే క‌లుసుకున్నాం. వీలు చేసుకొని షిక‌ర్ల‌కెళ్లాం. గంట‌ల కొద్ది ఫోన్లో మాట్లాడుకున్నాం.

ఎప్పుడూ ఏ వాంత‌రం ఎదుకాలేదు. కానీ నా బ్యాడ్ టైం. ప్రేమ విలువ తెలిసిన రోజే నా జీవితంలో పెను తుఫాను మొద‌లైంది. త‌న‌ని కౌగిలించుకున్న క్ష‌ణమైనా గ‌డ‌వ‌క‌ముందే వాళ్ల నాన్న ఊడిప‌డ్డాడు. ఆపై జ‌రిగింది అస‌లు నేనూహించ‌ని సీన్‌. చాలా రోజులుగా వేధిస్తున్నాడు. ప్రేమించ‌క‌పోతే చంపేస్తాన‌ని బెదిరించి లొంగ‌దీసుకోవాల‌నుకుంటున్నాడు. అని ఏడుస్తూ న‌న్ను దూరంగా నెట్టేసింది త‌ను. జాలి, అస‌హ్యం, షాక్‌..బాధ‌.. ఇలా ఒకేసారి నాలో ఎన్నో భావోద్వేగాలు.

Telugu love Story
ప్రేమికులు

ఈ సంఘ‌ట‌న జ‌రిగ చాన్నాళ్లైంది. అప్పుడు వాళ్ల నాన్న కొట్టిన చెంప‌దెబ్బ గుర్తు లేదు. ఆ అమ్మాయి నాపై వేసిన అభాండం గుర్తు లేదు. కానీ త‌న కౌగిలింత మాత్రం ఇప్ప‌టికీ న‌న్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ క్ష‌ణంలోనే నేను నిజంగా ఆమెతో ప్రేమ‌(Telugu love Story)లో ప‌డిపోయా. సంతోషం, బాధ‌, క‌ష్ణం, సుఖం, అన్నింట్లో తోడు నిల‌వ‌డానికి జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటా.

Leave a Comment