Telugu lo kathalu: ఒక అడవిలో ఒక ఎలుక మెల్లగా సాగిపోతూ ఉంది. ఇంతలో దానికొక పిల్లి ఎదురొచ్చింది. ”నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్ను తినేస్తాను” అని అంది పిల్లి. అందుకు ఆ ఎలుక ”నువ్వు నన్ను తినకుండా వదిలేశావంటే నేను తిరిగి వచ్చేటప్పుడు నీకొక బంగారు కంకణం ఇస్తాను” అంది. బంగారు కంకణం(Bangaru Kamkanam) అనగానే పిల్లికి ఆశ కలిగింది. ”సరే! అలాగే వెళ్ళు అంది.” ఎలుక వెళ్లి పోయింది. పిల్లికి ఒక కుక్క ఎదురొచ్చింది. ”నన్ను తినకుండా వదిలేస్తే ఎలుక నాకు ఇచ్చే బంగారు కంకణం నీకు ఇచ్చేస్తా అంది” పిల్లి. సరేనంది కుక్క.
Telugu lo kathalu
కుక్కకు ఒక తోడేలు ఎదురొచ్చింది. ”నన్ను తినకుండా వదిలెయ్యి. నీకు బంగారు కంకణం ఇస్తాను” అంది కుక్క. తర్వాత తోడేలకు ఒక సింహం కలిసింది. ముందు చెప్పిన జంతువుల లాగానే తనను వదిలేస్తే బంగారు కంకణం ఇస్తానన్నది తోడేలు. సింహం కూడా వదిలేసింది. సింహం తిరిగి చూసేప్పటికి అక్కడ ఒక మనిషి బాణం గురిపెట్టి నిలబడి ఉన్నాడు. తనను వదిలేస్తే బంగారు కంకణం ఇస్తానంది సింహం. ఎలుక పిల్లికి బంగారు కంకణం తెచ్చి ఇచ్చింది.
పిల్లి ఆ కంకణం తీసుకుని నోటి దగ్గరికి వచ్చిన ఆహారాన్ని వదులుకోవడం ఎందుకులే అనుకుని ఎలుకను తినేసింది. కుక్క పిల్ల దగ్గర కంకణం తీసుకుని దాన్ని చంపి తినేసింది. తోడేలు కుక్క దగ్గర కంకణం తీసుకుని దాన్ని తినేసింది. సింహం తోడేలు వద్ద కంకణం తీసుకొని, దాన్ని చంపి తినేసింది.
సింహం కంకణం తీసుకొచ్చి మనిషికి ఇచ్చి, ”ఇప్పటి వరకూ జరిగిందంతా చూశావు కదా! నేనెలాగూ నీకు ఆహారంగా ఉపయోగపడను. అందువల్ల నువ్వు ఈ కంకణం తీసుకుని నన్ను వదిలెయ్యి” అంది. అందుకు అతను ”ఓసి వెర్రి సింహమా! జంతువులు ఆహారం కోసం చంపుతాయి. కానీ మనిషి తన రక్షణ కోసం చంపుతాడు.” అంటూ సింహంపై బాణం గురి చూసి వదిలాడు. సింహం చచ్చిపోయింది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!