Telugu Jokes 2022 | మనిషి నిరంతరం కష్టపడుతూ బాధలు మర్చిపోవాలంటే అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వడానికి ఏదైనా సందర్భంలో జోకు ఉండాలి. నలుగురు మిత్రులు కలిసిన చోట కచ్చితంగా జోకులు పేలుతుంటాయి. భార్య భర్తల నడుమ కూడా జోకులు జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి జోకులు(Telugu Jokes 2022) గుర్తు చేసుకుంటూ రోజులో ఒక్కసారైనా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి.
న్యాయం
ఇద్దరు మిత్రులు కలిసి సారా కాయాలనుకుంటారు. అందులో ఒకడు రెండో వాడితే సారా కాయడానికి అవసరమైన నీళ్లు మొత్తం నేను తీసుకొస్తాను. బియ్యం మాత్రం నువ్వు తీసుకురా. ఇద్దరం కలిసి సారా కాద్ధాం…అంటాడు. అప్పుడు రెండో వాడికి ఓ అనుమానం వస్తుంది. బియ్యం మొత్తం నేను తీసుకొస్తే సారాని ఎలా పంచుకుంటాం? అని అడుగుతాడు. దానికి మొదటివాడు అవునవును. ఇందులో ఎలాంటి మోసం ఉండకూడదు. సారా తయారయ్యాక కూడా నేను నీళ్లే తీసుకుంటాను. మిగతాదంతా నువ్వే తీసుకో అంటాడు.
పెళ్లయింది!
ఆది: ఏమిట్రా, ఈ మధ్య కవితలేవీ రాయడం లేదు, ఏమైందేమిటీ?
రాజేష్: నేను ఎవరి కోసమైతే కవితలు రాశానో ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.
ఆది: అయితే, విరహాన్ని వ్యక్తం చేస్తూ కవితలు రాసేయ్ సూపర్‌గా వస్తాయి.
రాజేష్: నీకు అర్థం కావడం లేదు భయ్యా! ఆమె పెళ్లి నాతోనే జరిగింది.
నిక్కచ్చి మనిషిని!
ఏంటయ్యా! పాలల్లో ఎన్ని నీళ్లు కలిపావ్! పలుచగా ఉన్నాయి. అయ్యా! ఒక శేరు పాలకి రెండు శేర్లు నీళ్లు కలుపుతాను. మీరు ఎక్కువ కలపమన్నా, నేను కలపను. ఎందుకంటే నేను చాలా నిక్కిచ్చిగా మనిషిని!
గొడవైతే!
ఏంటోయ్! బ్రహ్మం, మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ ఆట. గొడవ ఏమైనా వస్తే నీకేమీ ఇబ్బంది లేదు కదా!. లేదు, ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అయితే నేను రన్నింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్‌ను.
భర్త : నీతో పెళ్లి నాకు విసుగొచ్చింది. ఇక నుంచీ విడిగా ఉందాం ఏమంటావ్?
భార్య: అలాగేనండీ, నేను లోపల ఉంటాను. మీరు బయట వరండాలో ఉండండి.
అలవాటు
గోపాల్: పూలకొట్లో పనిచేసిన కుర్రాణ్ణి నా పచారి కొట్లో పెట్టుకుని పెద్ద పొరపాటు చేశా!
రామం: ఇప్పుడేమైందనీ అంతగా బాధపడిపోతున్నావ్?
గోపాల్: అరగంటకోసారి సరుకుల మీద నీళ్లు చల్లుతున్నాడురా బాబూ!
రేపట్నుంచీ..
తింగిరి: డాక్టర్! నాకు ప్రతి రాత్రీ కలలో కోతుల క్రికెట్ మ్యాచ్ కన్పిస్తోంది.
డాక్టర్: ఈ మందులు వాడండి. అంతా సర్తుకుంటుంది.
తింగిరి: రేపట్నుంచీ వాడతాను డాక్టర్. ఎందుకంటే ఇవ్వాళ మ్యాచ్ ఫైనల్స్!.
మిసెస్ కమలాక్షి
మిసెస్ కమలాక్షీ మీకో గుడ్ న్యూస్… ఆనందంగా ఏదో చెప్పబోయిన డాక్టర్ పరాంకుశం ఆమె కోపంగా చూడటంతో ఆగిపోయాడు. మిసెస్ కాదు…మిస్ కమలాక్షీ! మైండ్ ఇట్ డాక్టర్. ఏంటో చెప్పండి ఆ గుడ్ న్యూస్… అందామె కోపం అణుచుకుంటూ..
సారీ మేడమ్ అయితీ మీకది బ్యాడ్ న్యూసే మీరు తల్లికాబోతున్నారు..అని నసిగాడు డాక్టర్ పరాంకుశం.
బంగారు పళ్లు
భార్య: ఆ దొంగ వెదవ మీ ఉంగరం, వాచీ, పర్సు దోచుకునేదాకా అలా నోరుమూసుకుని ఎలా ఉండిపోయారండీ! (కోపంగా)
భర్త: అప్పుడు నోరు తెరిస్తే లోపలున్న రెండు బంగారు పళ్లు కూడా పీక్కుపోతాడని భయపడ్డానే!(తాపీగా చెప్పాడు అమాయక భర్త)
నెమ్మదిరోయ్..
వాసు: బామ్మా! ఇవ్వాళ నేను పరుగు పందెంలో పాల్గొంటున్నా.. కప్పు గెలుచుకురావాలని దీవించు!
బామ్మ: జాగ్రత్త! తొందరపడకుండా ఎనకా ముందూ చూసుకుంటూ నెమ్మదిగా పెరుగెత్తు (అని దీవించింది అమాయక బామ్మ!.
మా సహకారం
కొత్తగా వృద్ధాశ్రమం ప్రారంభించాం, మీ సహకారం ఎంతో అవసరం. అయితే ఈ సంవత్సరం ఆఖర్లో ఒకసారి కలవండి. ఈ ఆఫీసులో నలుగురం ఒకేసారి రిటైర్ అవుతున్నాం.
ఆకతాయి
టీచర్ః ఎదుటి మనిషి వినడం లేదని తెలిసి కూడా అదే పనిగా వాగుతూ విసిగించేవాణ్ణే మంటారు?
క్లా..స్..టీ…చ…ర్ (అది చివరి బెంచ్‌లో నుండి వచ్చి న సమాధానం)
భయం
ఇద్దరు మిత్రులు తప్పతాగి కారులో చాలా స్పీడుగా పోతుంటారు.
గిరి: అంత స్పీడుగా కారు నడుపుతున్నావ్ నీకేమాత్రం భయంలేదా?
హరి: నాకు భయమే.. అందుకేగా అది తెలియకుండా మందుకొట్టాం
గిరి: నాకు మాత్రం చచ్చేంత భయంగా ఉందనుకో
హరి: ఐతే నీకు కిక్ ఎక్కలేదన్నమాట ఒక పనిచెయ్! నాలా కళ్ళు గట్టిగా మూసుకునే ఉండు.
నాతో పెట్టుకోకు
సుబ్బారావు భార్య సుందరి పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి అంటే మా చెడ్డ చిరాకు అతగాడికి. అందుకని ఒకరోజు దాన్ని కారులో తనతో పాటు తీసుకెళ్లి దూరంగా వదిలేసి వచ్చేసరికి అది తనకంటే ముందే ఇంట్లో ప్రత్యక్షమై మ్యావ్ అని పలకరించి నవ్వింది. మర్రోజు ఇంకా చాలా దూరం తీసుకెళ్లి వదిలేసి వచ్చాడు. అయినా సరే మళ్లీ ఇంట్లో కనిపించింది. కోపం పట్టలేక దానికి దారి తెలియకుండా చేయాలని ఆ తర్వాతి రోజు కారును ఎటో ఎటో తిప్పి చాలా దూరం తీసుకెళ్లి వదిలేశాడు. ఆ తొందర్లో సుబ్బారావు ఇంటి దారి మర్చిపోయాడు.
ఏం చెయ్యాలో అర్థంగాక, ఇంటికి ఫోన్ చేశాడు. పిల్లిగాని వచ్చిందా?
అదిప్పుడే వచ్చింది. ఇంతకీ మీరెక్కడున్నారు? అడిగింది సుందరి
నేను దారి తప్పిపోయి ఇక్కడిక్కడే తిరుగుతున్నాగానీ ముందు నీ చేతిలోని ఫోన్ పిల్లికివ్వు. అన్నాడు సుబ్బారావు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ