telugu joke

telugu joke: క‌డుప్పుబ్బా న‌వ్వించే జోకులు ఇక్క‌డ చూడండి!

Special Stories

telugu joke: అంద‌మైన జీవితానికి అంద‌మైన న‌వ్వు కూడా ముఖ్యం. ఎన్నో ప‌నుల్లో మ‌నం రోజంతా ఉండి న‌వ్వడం మ‌రిచిపోతాం. స‌మ‌స్య‌లు ఎప్పుడూ ఉండేవే. ఉన్న జీవితంలో కాస్త న‌వ్వుతూ జీవిచ‌డం నేర్చుకోవాలి. న‌వ్వ‌డం న‌వ్వించ‌డం చేస్తూ ఉండాలి. ఇక్క‌డ ఎన్నో జోకులు ఉన్నాయి. మీరు కూడా ఆ జోకులు telugu joke, చూసి న‌వ్వుకోండి.

telugu joke: తెలుగు జోకులు

అమ్మాయి తండ్రి : చాలా గారాభంగా పెంచామండి వంట రాదు. మీరే కొంచెం స‌ర్ధుకోండి.
అబ్బాయి తండ్రి : మేము కూడా చాలా గార‌భంగా పెంచామండి, ఏ job లేదు మీరే స‌ర్ధు కోండి.

భ‌ర్త : మ‌న ఇర‌వైయేళ్ల సంసారంలో ఎప్పుడు చూసినా నా మాట‌ల్లో త‌ప్పుల్ని వెత‌క‌డం త‌ప్ప ఇంకేమైనా చేశావేంటే కాంతం?
భార్య : ఇరవైయ్యేళ్లు కాదు.. 21.

భ‌ర్త : అన్నీ వ‌దిలేసి ఎటైనా వెళ్లిపోవాల‌ని ఉంది కొన్ని రోజులు.
భార్య : అయితే…డీ మార్ట్ వెళ్లొద్దామండీ ఒక‌సారి, మ‌ళ్లీ మీరు తిరిగి వ‌చ్చేస‌రికి టైం ప‌డుతుందేమో..!

తాగుబోతు : ప్ర‌భుత్వం న‌డుస్తుంది తాగుబోతుల వ‌ల్ల అంటారు క‌దా. నిజానికి అది ఆడ‌వాళ్ల వ‌ల్ల న‌డుస్తుంది. ఎందుకంటే మేం తాగేది వాళ్ల వ‌ల్లే క‌దా..!

అంద‌మైన దాంప‌త్య‌మంటే భ‌ర్త కిళ్లీ న‌మిలితే భార్య పెదాలు ఎరుపెక్క‌డం అంతే కానీ,
భ‌ర్త మందు తాగితే భార్య‌కి కిక్కు ఎక్క‌డం కాదు.

నిజానికి ఈ ఆడ‌వాళ్లు ఎవ‌రికీ అర్థం కారు. రెడీ అవ్వ‌డానికి Beauty parlour వెళ్తారు…కానీ, అదే బ్యూటీ పార్ల‌ర్ వెళ్ల‌డానికి కూడా రెడీ అవుతారు.

వాతావ‌ర‌ణ విశేషాలు : రేపు ప‌గ‌లంతా వెలుతురు గాను రాత్రి చీక‌టి గాను ఉంటుంది.
అనుమానాలు ఉంటే ఫోన్ చెయ్య‌గ‌ల‌రు.

మామ గారు : అల్లుడూ..ఏం చేస్తున్నావు?
అల్లుడు : ఆరోగ్యానికి క‌షాయాలు మంచివ‌ని యూట్యూబ్‌లో చెబ్తేనూ, రోజూ ఈ ద్రాక్ష క‌షాయం తాగుతున్నా మాంగారూ..!!

బ్రిటీషోడు ఎప్పుడూ తెలివైనోడే..! మ‌న దేశంలో సిరిసంప‌ద‌ల‌తో వాడు పాలించాడు. వాడి దేశం ద‌రిద్రంలో ఉన్న‌ప్పుడు మ‌నోడికి ప‌రిపాల‌న అప్ప‌గించాడు.

చిన్న‌ప్పుడు జ్వ‌రం వ‌స్తే డాక్ట‌ర్ చెప్పే రెండు మాట‌లు మాత్రం బాగా న‌చ్చేవి.
రెండు రోజులు స్నానం చేయ‌కు. స్కూల్‌కు వెళ్ల‌కు.

భార్య : వినాయ‌క చ‌వితి రాత్రి ఇంటికి రాలేదు ఎక్క‌డికి వెళ్లారు?
భ‌ర్త : పంతులు గారు చంద‌మామ‌ని చూడ‌కూడ‌ద‌ని చెప్పారు క‌దా..!
అందుకే రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో ప‌డుకున్నానే…!

మ‌గ‌వారికి సంస్కారం త‌ల్లి నేర్పిస్తుంది.
భాధ్య‌త తండ్రి నేర్పిస్తాడు. మిగ‌తావి
అంట్లు, బ‌ట్ట‌లు, వంట అన్నీ భార్యే నేర్పించాలి పాపం!

స‌గ‌టు భ‌ర్త : జ్యోతిష్యుడు నా చేయి చూసి.. భ‌లే మ‌చ్చ సార్‌…మీకు మంచి భార్య వ‌స్తుంది అన్నాడు.
ఏడ్చిన‌ట్టు ఉంది నా త‌ల రాత. అది మ‌చ్చ కాద‌య్యా..మా ఆవిడ పెట్టిన వాత‌.

నిన్న రాత్రి ఒక మెస్సేజ్ వ‌చ్చింది. ఈ message 15 మందికి పంపితే ఒక అద్భుతం జ‌రుగుతుంద‌ని అన్నారు. తీరా ఉద‌యాన్నే లేచి చూస్తే ఆ 15 మంది న‌న్ను బ్లాక్ చేశారు.

50 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న భార్య, భ‌ర్త‌లు ఇద్ద‌రూ అలా న‌డుస్తూ వెళ్తున్నారు.
ఎదురుగా ఒక ద‌య్యం వ‌చ్చి మీరు ఏదైనా వ‌రం కోరుకోండి ఇస్తాను అని చెప్పింది.
భార్య‌..నాకు మా ఆయ‌న‌తో లోకం మొత్తం చూసి రావాలి అని ఉంది.
ఓం..బూమ్‌..బుస్‌..ఇదిగో తీసుకో Flight tickets, ఎంజాయ్‌.
భ‌ర్త‌…నాకు నా వ‌య‌సు క‌న్నా 30 సంవ‌త్స‌రాల చిన్న వ‌య‌సు భార్య కావాలి…
ఓం..బూమ్‌..బుస్‌.. భ‌ర్త వ‌య‌సు 80 సంవ‌త్స‌రాలు చేసి ఇప్పుడు బాగుందా..ఎంజాయ్ అని వెళ్లిపోయింది ద‌య్యం.

సుబ్బారావు : ఏంటి అంద‌రికీ Sweets పంచుతున్నావు? ప్ర‌మోష‌న్ ఏమైనా వ‌చ్చిందా?
రామ‌రావు : కాదు మా ఆవిడ 10 సంవ‌త్స‌రాల నుండి చూస్తున్న సీరియ‌ల్ అయ్యిపోయింది.

పెళ్లైన వారు భార్య ఫొటోను ప‌ర్సులో ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
ఎందుకంటే పెద్ద స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ఒక్క‌సారి ఫొటో చూస్తే చాలు.
అదీ ఓ స‌మ‌స్యేనా అనిపిస్తుంద‌ని.

మ‌గాళ్లు రెండు ర‌కాలు.
పెళ్లి కాలేద‌ని ఏడ్చేవాళ్లు
పెళ్లైంద‌ని ఏడ్చేవాళ్లు
మ్యాజిక్ ఏంటంటే
ఏడుపు మాత్రం కామ‌న్‌..!

దేవ క‌న్య‌లు అంటే ఎవ‌రో తెలుసా?
చూసిన వెంట‌నే మ‌న మెస్సేజ్‌ల‌కు Reply ఇచ్చే వాళ్లు.

స్టేట‌స్ అనేది స‌ర‌దాగా ఒక‌టో రెండో పెట్టాలి.
అంతే గాని గూడ్స్ ట్రైన్కి బోగీలా పెట్ట‌కూడ‌దు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *