TELUGU FUNNY STORY:బామ్మగారా మజాకా! లాయర్లకు దిమ్మదిరిగినంత పని చేసే..!
TELUGU FUNNY STORY ఒక్క చిన్న టౌన్లో ఉన్న కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్లి, మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా? అని అడిగాడు దర్పంగా నల్లకోటు సర్థుకుంటూ.. ఆవిడ వెంటనే, అయ్యో, తెలియక పోవడమేంటీ..? బాగా తెలుసును…పెద్ద పిచ్ఛయ్య గారి రెండో అబ్బాయి గోవిందానివి కదూ.. నీ చిన్నప్పటి నుండీ నిన్నూ.. మీ కుటుంబాన్నీ ఎరుగుదును నాయనా..! నిజం చెప్పాలంటే, చిన్నప్పుడు నిన్ను ఎందుకు పనికిరావు అనుకునేదాన్ని. అబద్దాలాడేవాడివి, జనాన్ని మోసం చేసేవాడివి, ఆఖరుకి నీ భార్యను కూడా మోసం చేసావు..పైసాకా పనికిరాకపోయినా, గొప్పలు పోయేవాడివి. నాకు బాగా తెలుసును కదా!.. (TELUGU FUNNY STORY)అంది.
పి.పి గారు హడలిపోయి, బిక్క చచ్చి పోయారు. ఏం మాట్లాడాలో తెలియక, డిఫెన్సు లాయరు గారిని చూపించి, వారు తెలుసా? అని అడిగాడు. బామ్మగారు ఠక్కున, ”మాబాగా తెలుసును.. జేబులు కత్తిరించే వీరదాసు కొడుకు కుమారుదాసు కదా..! చిన్నప్పుడు పనీ పాటా లేకుండా వీధులెంట బలాదూర్ గా తిరిగేవాడు. లేని దురలవాటు లేదు..తాగుబోతు, తిరుగుబోతు కూడానూ! ఇతనిది అందరి కంటే చెత్త ప్రాక్టీసు అని ఊరంతా చెప్పుకుంటారు. పైగా ముగ్గురు స్త్రీలతో అక్రమ సంబంధం..అందులో ఒకరు మీ ఆవిడే కదా! ”నాకు తెలీకేం, బాగా తెలుసు.. ”అంది గుక్క తిప్పుకోకుండా.. డిఫెన్స్ గారికి చచ్చినంత పనైంది. జడ్జిగారు ఇద్దరు లాయర్లను తన దగ్గరికి పిలిచి రహస్యంగా మీ ఇద్దర్లో ఎవరైనా తెలివి తక్కువగా, జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే, కోర్టు ధిక్కారం కేసు కింద జైల్లో తోయించేస్తా, జాగ్రత్త!! అని బెదిరించాడు. లాయర్లు షాక్!! బామ్మ రాక్స్!!