Telugu Cricket News | శుక్రవారం 22, 2022 కు సంబంధించిన క్రికెట్ వార్తలు అందజేస్తున్నాం. ఇందులో భాగంగా రోహిత్, బుమ్రాలకు అరుదైన గౌరవం, బాలీవుడ్ నటుడి కూతురుతో ఇండియన్ స్టార్ పెళ్లి, రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్, కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రాహుల్ తదితర వార్తల(Telugu Cricket News)ను కింద చదవండి.
రోహిత్, బుమ్రాలకు అరుదైన గౌరవం
టీమిండియా క్రికెటర్లు రోహిత్, బుమ్రాలకు Wisden Cricketer of year 2022 జాబితాలో చోటు దక్కింది. డెవాన్ కాన్వే(కివీస్), రాబిన్సన్(ఇంగ్లాండ్) మహిళా క్రికెటర్ డేన్‌వాన్ (దక్షిణాఫ్రికా) ఈ లిస్టులో ఉన్నారు. జో రూట్ (ఇంగ్లాండ్) లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్‌గా, సఫారీ బ్యాటర్ లీజెల్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్‌గా నిలిచారు. రిజ్వాన్ (పాక్) లీడింగ్ T20 క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు పొందారు.
ఇండియన్ స్టార్ పెళ్లి బాలీవుడ్ నడుటు కూతురుతో
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు Athiya Shettyతో టీమిండియా స్టార్ క్రికెటర్ KL రాహుల్ వివాహం ఈ ఏడాది జరగనున్నట్టు తెలుస్తోంది. తాము రిలేషన్లో ఉన్నట్టు గతేడాది KL వెల్లడించిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబసభ్యులు ok చెప్పారు. దీంతో మంగళూరు సంప్రదాయంలో పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయని ఓ బాలీవుడ్ website పేర్కొంది. సునీల్‌శెట్టి పూర్వీకులది మంగళూరు కాగా, కెఎల్ రాహుల్ కూడా ఆ ప్రాంతం వారేనని తెలుస్తోంది.
రిటైర్మెంట్ ప్రకటించిన Pollard
వెస్టీండీస్ ఆల్ రౌండర్ కిరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు పోలార్డ్ చెప్పారు. గత కొన్నేళ్లుగా తనకు మద్దుగా నిలిచిన క్రికెట్లరు, విండీస్ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పొలార్డ్ ప్రకటించారు.
Kohli కి విశ్రాంతి అవసరం: రవిశాస్త్రీ
ఇటీవల వరుస ఫార్మేట్లలో విఫలమవుతున్న కోహ్లీకి కొన్ని రోజులు విశ్రాంతినివ్వాలని team india మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. భారీ అంచనాలు, తీవ్ర ఒత్తిడితో కోహ్లీ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు లేదా తర్వాత 2 నెలల వరకు విశ్రాంతినివ్వాలని అన్నారు. అతనిలో ఇంకా ఆరేడేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందన్నారు. ఒత్తిడిలో వరుసగా ఆడించి కోహ్లీని ఆటకు దూరం చేయవద్దని ఓ Sports Channel ఇంటర్వ్యూలో తెలిపారు.
కోహ్లీ Recordను బద్దలు కొట్టాడు
T20ల్లో వేగంగా 6 వేల రన్స్ చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచారు. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అతడు 179 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, కోహ్లీ 184 ఇన్నింగ్స్‌లు ఆడారు. ఓవరాల్‌గా Gayle 162 మ్యాచ్‌ల్లో 6 వేల రన్స్ అందుకోగా, బాబర్ అజామ్ (165) తర్వాతి స్థానంలో ఉన్నాడు. రాహుల్ మూడో స్థానంలో నిలిచారు. రాహుల్ IPL-2022లో ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్‌ల్లో 265 రన్స్ చేసి టాప్-2 స్కోరర్‌గా నిలిచాడు.
ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు మృతి
బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు మాజీ క్రికెటర్లు Samiur Rahman, Mosharraf Hossain ఒకే రోజు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ తొలి వన్డే టీమ్‌లో సభ్యుడైన సమియుర్ రెహ్మాన్ ఢాకాలో రెండ్రోజుల కిందట తుదిశ్వాస విడిచారు. 1986- ఆసియా కప్ ఆడారు. కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. మొషరఫ్ హుస్సేన్ సైతం బ్రెయిన్ ట్యూమర్తోప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయంగా 5 వన్డేలు బంగ్లా తరపున ఆడారు. దేశవాళీలో 572 వికెట్లు తీశారు.
Karthikను టీమిడియాలోకి తీసుకోండి: గవాస్కర్
ఐపీఎల్లో భీకర ఫామ్‌లో ఉన్న సీనియర్ టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను మళ్లీ టీ20 జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. అతని వయసు చూడకుండా ఆటను మాత్రమే చూడాలన్నారు. టీ20 వరల్డ్ కప్ టీమ్ లో కార్తీక్‌కు చోటు ఇవ్వాలన్నారు. అతడు మంచి ఫినిషర్ కాగలడని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు కార్తీక్ ఆర్సిబి తరపున 6 మ్యాచ్‌లు ఆడి 197 రన్స్ చేశారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!