Telugu Cinema | శనివారం సినిమా వార్తలను కింద ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కెజిఎఫ్ ఫేమ్ నటి రవీనా టాండన్ తన సినిమా కెరీర్ గురించి తెలిపింది. SVP టైటిల్ సాంగ్ రికార్డులను సృష్టిస్తోంది. రామ్‌చరణ్ ఆచార్య లో పూర్తి పేరుపై ఆసక్తి నెలకొంది. కొరటాల చేతిలో మూడు సినిమాలు, ఇలాంటి మరికొన్ని సినిమా(Telugu Cinema) వార్తల కోసం కింద చదవండి.
స్టూడియోల్లో వాంతులు శుభ్రం చేశా: Raveena
KGF2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ నటి Raveena టాండన్, తన కెరీర్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. తాను సినిమాల్లోకి రాకముందు స్టూడియోల్లో ఫ్లోర్లు తుడిచానని, వాంతులు శుభ్రం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడు చాలా మంది నువ్వు స్క్రీన్ మీద ఉండాలి. స్క్రీన్ వెనుక కాదు అని తనతో చెప్పారట. అప్పుడు నేనా? నటినా? కానీ పని అని తాను అనుకునేదాన్నని రవీనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
మహేశ్‌బాబు Sarkar Vaari Pata టైటిల్ సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ సూపర్ స్టార్ Mahesh బాబు నటిస్తున్న సర్కారువారి పాట మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించగా మే 12న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన Kalavathi సాంగ్ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
రామచరణ్ పేరు Sidda Ram Bahudur అంట
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య నుంచి ఓ ఇంట్రెస్టింగ్ News బయటికి వచ్చింది. సినిమాలో చరణ్ పేరు సిద్ధ అని మనకు తెలిసిందే. అయితే, అది పూర్తి పేరు కాదట. సిద్ధ రామ్ బహుదూర్ గా చరణ్ కనిపిస్తాడట. ఇంటర్వెల్‌కి 10 నిమిషాల ముందు చెర్రీ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అనుష్క కోమియో రోల్ ఇంట్రెస్టింగ్గా ఉండనుందని సమాచారం.
ముగ్గురు స్టార్ హీరోలతో Koratala మూవీస్
ఏప్రిల్ 29న ఆచార్య విడుదల కాగానే, NTR-30 షూటింగ్లో బిజీ కానున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఆ తర్వాత మహేశ్, చరణ్, అల్లు అర్జున్‌లతో సినిమాలు లైన్లో ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మహేశ్‌తో తీసిన 2 సినిమాలు బిగ్జెస్ట్ హిట్స్. త్వరలో మరో సినిమా చేస్నున్నా, చెర్రీ, బన్నీలతోనూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వారి డేట్స్‌ను బట్టి ప్రారంభమవుతాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. అని తెలిపారు.
నాగ్‌కు ప్రభాస్ Birthday విషెస్
శనివారం యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ పుటిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీస్‌లో అతని ఫొటోను షేర్ చేస్తూ నాకు తెలిసిన స్వీటెస్ట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపారు. Project K తీస్తున్నందుకు ధన్యవాదాలన్నారు. త్వరలో మిమ్మల్ని సెట్స్‌లో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నాడు.
Kathu vakkala rendu Kadhai తెలుగు ట్రైలర్ సూపర్
విజయసేతుపతి, నయనతార, సమంత నటిస్తున్న రొమాంటిక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాత్తువాకుల రెండు కాదల్ (KRK) తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఖుషి సినిమాలోని టెంపుల్ సీన్, బాహుబలి, టైటానిక్ సన్నివేశాలను రీక్రియేట్ చేయడం ఆకట్టుకుంటోంది. నయన్, సామ్ మధ్య వచ్చే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ చిత్రానికి నయన్ BoyFriend విఘ్నేష్ శివన్ డైరెక్షన్ వహించాడు.
RRR Collection లు సునామీని సృష్టిస్తున్నాయి!
RRR మూవీ Collectionల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్టు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.350 కోట్ల వసూలు చేయగా, కన్నడం, తమిళం, మలయాళంలో వందకోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్లో రూ.300 కోట్లను వసూలు చేసింది. ఈ మూవీ రూ.1,100 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించినా Share మాత్రం రూ.600 కోట్లకే పరిమితమైంది.
ఒక్క Song కోసం రూ.3 కోట్ల ఖర్చు
వారియర్ చిత్రానికి DSP అద్భుతమైన సంగీతం ఇచ్చారని డైరెక్టర్ లింగుస్వామి తెలిపారు. బుల్లెట్ పాట కోసమే నిర్మాత ఏకంగా రూ.3కోట్లు ఖర్చుపెట్టారని చెప్పారు. రామ్ నటించిన ఈ ద్విభాషా చిత్రంలోని పాటను తమిళనాడు ఎమ్మెల్యే ఉదయ నిధి stalin చెన్నైలో ఆవిష్కరించారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. లింగుస్వామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారని Hero Ram చెప్పారు.
Raki Sawant క్షమాపణలు చెప్పాలి
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాను వేసుకున్న అర్దనగ్న దుస్తుల్ని ఆమె Tribal Dress అంటూ నెటిజన్స్‌కు పరిచయం చేసింది. దీంతో తమ మనోభావాలను దెబ్బతీశారని రాంచీ పోలీసు స్టేషన్లో గిరిజన నేత అజయ్ టిర్కీ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాఖీ సావంత్ తమకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!