Telugu Alankaralu: తెలుగు అలంకార‌ములు | ఉప‌మాలంకారం | అలంకార‌ముల ఉదాహ‌ర‌ణ‌లు

Telugu Alankaralu

Telugu Alankaralu | అలంకారములు రెండు ర‌కాలు ఇవి ఎ.శ‌బ్ధాలంకార‌ములు బి.అర్ధాలంకార‌ములు. ప్ర‌స్తుతం వీటి గురించి ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా విపులంగా తెలుసుకుందాం. Alankaralu ఎన్ని ర‌కాలు? వాటిలో ఎన్ని అలంకారాలు ఉన్నాయి. Alankaralu Examples లాంటి వ‌న్నీ ఇక్క‌డ తెలుసుకుందాం.

ఎ.శ‌బ్ధాలంకార‌ములు

1.వృత్యానుప్రాస‌ము – ఒకే హ‌ల్లు అనేక ప‌ర్యాయ‌ములు తిరిగి తిరిగి వ‌స్తే అది వృత్తాసు ప్రాసాలంకార‌ము అంటారు.

ఉదా- అమందా నందంబున గోవిందుడు ఇందిరి మందిరంబు చొచ్చి.

2.చేకాను ప్రాస‌ము- అర్థ బేధ‌ముతో రెండ‌క్ష‌ర‌ముల ప‌ద‌మును వెంట‌వెంట‌నే ప్ర‌యోగించును.

ఉదా- పాప హ‌రుహ‌రు సేవించెద‌ను.

3.లాటాను ప్రాస‌ము- అర్థ‌మునందు గాక‌, తాత్ప‌ర్య‌మందు నందు మాత్ర‌మే బేధ‌ముండునట్టు ఒక ప‌ద‌మును వెంట వెంట‌నే ప్ర‌యోగించుట‌.

ఉదా- శ్రీ‌నాధు వ‌ర్ణించు జిహ్వ జిహ్వ‌

4.య‌మ‌క‌ము- అర్థ‌బేధ‌ము గ‌ల అక్ష‌ర‌ముల స‌ముదాయ‌ము మ‌ర‌ల మ‌ర‌ల ఉచ్చ‌రింపబ‌డిన‌చో య‌మ‌క‌మ‌గును.

ఉదా- లేమ ద‌నుజుల‌గెలువ‌గా లేమా

5.ముక్త‌ప‌ద గ్ర‌స్త‌ము- పాద‌ము చివ‌ర‌నుండు ప‌ద‌ముతో త‌రువాత ప‌ద‌మును ప్రారంభించుట‌.

ఉదా- సుద‌తీ నూత‌న‌మ‌ద‌నా, మ‌ద‌నాగ‌తురంగ పూర్ణ‌మ‌ణిమ‌య స‌ద‌నా.

6.రూప‌కాలంకార‌ము- ఉప‌మాన ఉప‌మేయ‌ముల‌కు బేధ‌మున్న‌ను అబేధ‌ము చెప్పుట‌ను రూప‌కాలంకార‌ము అందురు.

ఉదా- సంసార సాగ‌ర‌ము నీదుట మిక్కిలి క‌ష్ట‌ము.

7.శ్లేషాలంకార‌ము- అనే అర్థ‌ములు వ‌చ్చున‌ట్టు చెప్పుట శ్లేషాలంకార‌ము.

ఉదా- రాజు క‌వ‌ల‌యానంద‌క‌రుడు.

8.అర్థాంత‌ర‌న్యాస‌ము- సామాన్య‌మును విశేష‌ము చేత‌ను, విశేష‌మును సామాన్య‌ము చేత‌ను స‌మ‌ర్థించుట‌.

ఉదా- మ‌హాత్ముల‌కు సాధ్య‌ము కానిదేమున్న‌ది.

9.అత‌శ‌యోక్తి- ఒక విష‌య‌ము ఉన్న‌దానికంటే అధిక‌ము చేసి వ‌ర్ణించుట‌.

ఉదా-ఊరియంద‌లి భ‌వ‌న‌ములు ఆకాశ‌మును అంటుతున్న‌వి.

10.దృష్టాంత‌ము- ఉప‌మాన ఉప‌మేయ‌ముల‌కు, బింబ ప్ర‌తిబింబ భావ‌ము ఉండున్న‌ట్టు వ‌ర్ణించుట‌.

ఉదా-ఓ రాజా నీవే కీర్తిమంతుడ‌వు.

11.స్వ‌భావోక్తి- జాతి గుణ‌క్రియాదుల‌లోని స్వ‌భావ‌ము ఉన్న‌దున్న‌ట్టు మ‌నోహ‌ర‌ము వ‌ర్ణించుట‌.

ఉదా- అర‌ణ్య‌మునందు లేళ్లు బెదురు చూపుల‌తో చెంగు చెంగున దుముకుచు ప‌రిగెడుతున్న‌వి.

Telugu Alankaralu : బి.అర్థాలంకార‌ములు

1.ఉపమాలంకార‌ము- ఉప‌మాన ఉప‌మేయాల‌కు గ‌ల పోలిక‌ను మ‌నోహ‌ర‌ముగా వ‌ర్ణించును.

ఉదా- ఆమె ముఖ‌ము చంద్ర బింబ‌ము వ‌లె ప్ర‌కాశించుచున్న‌ది.

2.ఉత్ప్రేక్షాలంకార‌ము- ఉప‌మేయ‌మును ఉప‌మాన‌ముగా ఊహించుట‌ను ఉత్ప్రేక్షాలంకార‌ము అందురు.

ఉదా- ఆ వ‌చ్చుచున్న ఏనుగునడ‌గొండ‌మేమో అనున‌ట్లున్న‌ది

3.రూప‌కాలంకార‌ము- ఉప‌మాన ఉప‌మేయ‌ముల‌కు బేధ‌మున్న‌ను అబేధ‌ము చెప్పుట‌ను రూప‌కాలంకార‌ము అంద‌రు.

ఉదా- సంసార సాగ‌ర‌ము నీదుట మిక్కిలి క‌ష్ట‌ము.

4.శ్లేషాలంకార‌ము- అనేక అర్థ‌ములు వ‌చ్చున‌ట్టు చెప్పుట శ్లేషాలంకార‌ము.

ఉదా- రాజు క‌వ‌ల‌యానంద‌క‌రుడు.

5.అర్థాంత‌ర‌న్యాస‌ము- సామ‌న్య‌మును విశేష‌ము చేత‌ను, విశేష‌మును సామాన్య‌ము చేత‌ను స‌మ‌ర్థించుట‌.

ఉదా- మ‌హాత్ముల‌కు సాధ్య‌ము కానిదేమున్న‌ది.

6.అతిశ‌యోక్తి- ఒక విష‌య‌ము ఉన్న‌దానికంటే అధిక‌ముగా చేసి వ‌ర్ణించుట‌.

ఉదా- ఊరియంద‌లి భ‌వ‌న‌ములు ఆకాశ‌మును అంటుతున్న‌వి.

Share link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *