RamappaTemple

RamappaTemple: మోడీజీ.. కిష‌న్ రెడ్డికి ఇచ్చిన మొద‌టి బ‌హుమ‌తి ఇది అంటున్న బండి సంజ‌య్‌

Spread the love

RamappaTemple: హైద‌రాబాద్‌ : తెలంగాణ‌లో చారిత్రాత్మ‌క దేవాల‌య‌మైన ములుగు జిల్లాలోని రామ‌ప్ప ఆల‌యానికి ప్ర‌పంచ వార‌స‌త్వ (UNESCO) హోదా ల‌భించ‌డం హ‌ర్ష‌దాయ‌క‌మ‌ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ కుమార్ అన్నారు. ఈ మేర‌కు ఆదివారం హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. యునెస్కో ద్వారా ఈ గుర్తింపు రావ‌డం అంటే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆశీస్సులు, స‌హాయ స‌హ‌కారాల‌తోనే సాధ్య‌మైంద‌ని అన్నారు.

రామ‌ప్ప(RamappaTemple) ఆల‌యాన్ని ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తించేలా తోడ్ప‌డిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి, కేంద్ర‌, సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డి, కేంద్ర స‌హాయ మంత్రి మీనాక్షి లేఖికి అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్టు పేర్కొన్నారు. కిష‌న్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మొద‌టి బ‌హుమ‌తిగా తాను భావిస్తున్నాని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మ‌రెన్నో అవ‌కాశాలు తెలంగాణ‌కు కిష‌న్ రెడ్డి క‌ల్పిస్తార‌ని ఆశిస్తున్నాని అన్నారు.

రామ‌ప్ప దేవాల‌యానికి ఇంత‌టి గొప్ప గుర్తింపు కోసం, స‌భ్య దేశాల‌తో ఏకాభిప్రాయం సాధించ‌డానికి మోడీ ఎంతో కృషి చేశార‌న్నారు. అందుకోసం వేగ‌వంత‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకొని స‌త్వ‌ర చ‌ర్య‌ల‌ను చేప‌ట్టార‌న్నారు. అన్ని దేశాల ఏకాభిప్రాయంతోనే ఇది సాధ్య‌మైంద‌న్నారు. తెలంగాణ చారిత్రాత్మ‌క గొప్ప‌త‌నాన్ని విశ్వ‌వేదిక‌పై నిల‌బెట్టిన ఘ‌న‌త న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వానిదేన‌ని పేర్కొన్నారు.

రామ‌ప్ప దేవాల‌యానికి అంత‌ర్జాతీయ గుర్తింపు తీసుకురావ‌డం వ‌ల్ల తెలంగాణ‌లో ప‌ర్యాట‌క రంగం బాగా అభివృద్ధి చెంద‌డంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా గొప్ప ఖ్యాతి వ‌స్తుంద‌ని భావిస్తున్నాను అని అన్నారు. యునెస్కోలోని స‌భ్య‌దేశాల‌ను ఒప్పించ‌డం కోసం కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, కేంద్ర స‌హాయ మంత్రి మీనాక్షి లేఖి ఎంతో కృషి చేశార‌న్నారు. వారి విశేష్ కృషి ఫ‌లితంగా ఈ గుర్తింపు సాధ్య‌మైంద‌న్నారు.

ఖండాంత‌రాలు దాటిన కాక‌తీయ శిల్ప‌క‌ళా వైభ‌వం

కాక‌తీయ శిల్ప‌క‌ళా వైభ‌వం ఖండాంత‌రాలు దాటి దేశానికి గుర్తింపును తెచ్చింది. అత్య‌ద్భుత శిల్ప సంప‌ద‌కు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని రామ‌ప్ప ఆల‌యాన్ని ప్ర‌పంచ వార‌స‌త్వ స్థ‌లంగా యునెస్కో గుర్తించింది. వార‌స‌త్వ క‌ట్ట‌డాల విశిష్ట‌త‌ల ప‌రిశీల‌న కోసం చైనాలోని ఫ్యూజులో వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మైన ప్ర‌పంచ హెరిటేజ్ క‌మిటీ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వార‌స‌త్వ క‌ట్ట‌డాలు యనెస్కో ప‌రిశీల‌న‌కు ఎంపిక‌వ్వ‌గా, మ‌న దేశం నుంచి 2020 సంవ‌త్స‌రానికి రామ‌ప్ప‌కు మాత్ర‌మే ఈ ఖ్యాతి ద‌క్కింది. తెలుగు రాష్ట్రాల్లో వార‌స‌త్వ గుర్తింపు పొందిన తొలి క‌ట్ట‌డంగా రామ‌ప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేట‌లో క్రీ.శ.1213లో నిర్మిత‌మైన అపురూప క‌ట్ట‌డం రామ‌ప్ప ఆల‌యం. శిల్పి రామ‌ప్ప పేరుతో ఈ కాక‌తీయ క‌ట్ట‌డం ప్రాచుర్యంలోకి వ‌చ్చింది.

NIA: Nursing స్టూడెంట్ను Maoistల్లో చేర్పించారా? మూడేళ్న త‌ర్వాత న్యాయ‌వాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

NIA | రాష్ట్ర రాజ‌ధాని హైదారాబాద్‌లో ప‌లువురు లాయ‌ర్లు, సామాజిక కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌ల్లో ఎన్ఐఏ గురువారం సోదాలు చేసింది. గ‌తంలో క‌నిపించ‌కుండా పోయిన న‌ర్సింగ్ విద్యార్థిని రాధ Read more

Maha Annadanam: ఖ‌మ్మం న‌గ‌రంలో Saibaba mandirలో మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం

Maha Annadanam | ఖ‌మ్మం న‌గ‌రంలో గురువారం Khanapuram హ‌వేలి విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ లో షిరిడీ Sai Baba మందిరం 15వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఉద‌యం నుండి Read more

Accreditation apply date: తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ల‌కు గ‌డువు పొడిగింపు

Accreditation apply date | తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ విష‌యంలో ఆన్‌లైన్ లో త‌లెత్తిన ఇబ్బందుల‌ను దృష్టిలో Read more

Ettari Antayya: వ‌డ్డెర సంఘం కోసం నేను అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తా!

Ettari Antayya | వ‌డ్డెర సంఘం అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తాన‌ని రాష్ట్ర Shrama Sakthi అవార్డు గ్ర‌హీత‌, వ‌డ్డెర సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు ఎత్త‌రి అంత‌య్య Read more

Leave a Comment

Your email address will not be published.