telangana wines tender హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు రేపటి నుంచి(మంగళవారం) దరఖాస్తులు స్వీకరించనున్నట్టు అబ్కారీ శాఖ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివర తేదీ కాగా 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. ఎంపిక ప్రక్రియ ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో పూర్తి కానుంది. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నట్టు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఇప్పుడున్న 2,216 మద్యం దుకాణాలకు ఇవి అదనమని స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా ఈ కొత్త దుకాణాలు ఏర్పాటు అవుతాయని వివరించింది. దీంతో ఇప్పుడున్న 2,216 దుకాణాలకు పెరిగిన 404 దుకాణాలతో కలిపి ఆ సంఖ్య 2,620 కి (telangana wines tender)పెరిగింది.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు మద్యం దుకాణాల కేటాయింపుల ప్రక్రియను అబ్కారీ శాఖ పూర్తి చేసింది. కమిటీ సభ్యులతో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారుల సమక్షంలో డ్రా ద్వారా గౌడ్లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలను కేటాయించినట్టు తెలిపింది. ఈ మూడు కేటగిరీలకు కలిసి 756 మద్యం దుకాణాలు కేటాయించినట్టు అబ్కారీ శాఖ వెల్లడించింది. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద ఉన్నట్టు స్పష్టం చేసింది.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?