Telangana Tourism: నల్గొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 590 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Tourism) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ నెల 28వ తేదీన హిల్ కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, నదికి ఇరువైపులా నల్లమల్ల అందాల నడుమ అలలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతులు పంచనుంది.
శని – ఆదివారాల్లో ప్రయాణం
ప్రతి వారంతపు శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం ఆదివారం సాయంత్రం తిరిగి నాగార్జున సాగర్‌కు చేరుకుంటుంది. ఈ రెండు రోజుల ప్రయాణంలో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. అదే విధంగా పర్యాటకులకు మల్లన్న దర్శనాన్ని, బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది.
కనువిందు చేసే దృశ్యాలు ఇవే!
నందికొండ నుంచి శ్రీశైలం కు కొనసాగే ఈ రెండు రోజుల ప్రయాణం తీరం వెంబడి ఉన్న అమ్రాబాద్ నల్లమల్ల అడవుల ప్రకృతి సహాజ అందాలు పర్యాటకుల మనస్సులను ఇట్టే కట్టి పడేస్తాయి. కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో చాకలిగట్టు సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి.
గౌతమి బుద్ధుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జున కొండ సమీపంగా సాగుతూ కొద్ది ప్రయాణంలోనే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది. ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు, మొసళ్లు, అందమైన పర్వతాలు ముందుకు వెళ్లే కొద్ది చూడ ముచ్చటైన అందాలు కనువిందు చేస్తూనే ఉంటాయి. సాయంత్రానికి లింగాల గట్టు చేరుకుంటుంది. ఆ తర్వాత పర్యాటకులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆదివారం సాయంత్రానికి లాంచీలో నందికొండ చేరుకుంటారు.


ప్రయాణ వివరాలు!
టూరిజం శాఖ వారు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని టూరిజం శాఖ వారు నిర్ణయించిన రేట్ల వివరాలు హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ చేరుకుని హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుండి శ్రీశైలం కు లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.3,999 పిల్లలకు రూ.3,200 . నాగార్జున సాగర్ నుండి వన్ వే పెద్దలకు రూ.1499 , పిల్లలకు రూ.1199 టికెట్ రేటు నిర్ణయించినట్టుగా టూరిజం అధికారులు తెలిపారు.
తిరిగి మరలా వారంతపు శనివారం 28వ తేదీన శ్రీశైలం లాంచీ ట్రిప్పును ప్రారంభిస్తున్నట్టు వారు తెలిపారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు, టికెట్ ధరలను ఆన్లైన్లో పొందవచ్చునని తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ నెం. 9848540371, 7997951023 ను సంప్రదించండి.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!