యథేచ్ఛగా ఛత్తీస్‌ఘడ్‌కు అక్రమంగా తరలిపోతున్న తెలంగాణ మద్యం
ఆదివాసీ గిరిజన గ్రామాలే వారికి కాసుల వర్షం
Telangana to Chhattisgarh : Cherla : అక్రమ మద్యం రావాణా పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా ఏదో ఒక దారిలో మద్యం బాటిళ్లు అక్రమంగా తరలివెళ్లిపోతూనే ఉన్నాయి. తెలంగాణ మద్యం(Telangana lquor bottles)కు మంచి డిమాండ్ ఉండటంతో ఇటు ఆంధ్రా, అటు కర్ణాటక రాష్ట్రాలతో పాటు కొత్తగా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి కూగా గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మద్యం వ్యాపారులు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలే ఏజెన్సీ ఏరియా పైగా మావోయిస్టులు ప్రభావిత ప్రాంతం కావడంతో అదును చూసి తెలంగాణ మద్యంను సునాయాసనంగా ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు గిరిజన ప్రాంతాలకు వెళ్లిపోతుంది. ఇక్కడ నుంచి తెలంగాణ మద్యం తీసుకెళ్లి అక్రమ వ్యాపారులు అక్కడ యథేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా, దంతేవాడ జిల్లాలకు భారీగా మద్యం రవాణా అవుతుంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి సరుకులు కోసమంటూ చర్లకు కొన్ని ట్రాక్టర్లు వస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో అక్రమ మద్యం వ్యాపారులు ఆ ట్రాక్టర్ల ద్వారా మద్యం సీసాలను ఛత్తీస్‌ఘడ్ కు తరలిస్తున్నట్టు సమాచారం.
గిరిజన గ్రామాలే టార్గెట్‌గా!
తెలంగాణ – ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో గిరిజన ఆదివాసీ గ్రామాలకు సౌరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఛత్తీస్‌ఘడ్ మద్యం ఆ ఆదివాసీల గ్రామాలకు చేరడం లేదు. దీంతో తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రమ మద్యం వ్యాపారులకు ఇది ఓ వరంగా మారింది. దీంతో చర్ల నుంచి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు మద్యం తరలిస్తూ అక్కడ ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి నుండి డబ్బులు దండుకుంటున్నట్టు తెలుస్తోంది. చర్ల నుంచి ప్రతి రోజూ సుమారు రూ.2 లక్షల విలువ చేసే మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం.

ఛత్తీస్‌ఘడ్‌లోనే ఎక్కువ గిరాకీ!
ఇలా అక్రమ వ్యాపారంతో అధిక లాభాలు వస్తుండటంతో జిల్లాలో ఉన్న పలు మద్యం వ్యాపారులు మద్యం మొత్తాన్ని చత్తీస్ఘడ్ కే తరలిస్తూ ఇక్కడ మద్యం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేది బహిరంగంగా స్థానికులు చెప్పుకుంటున్న మాట. ఇది పూర్తిగా మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడంతో అధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో మద్యం మాఫియా ఆడిందే ఆటగా పాడిందే పాగా కొనసాగుతోంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారుల కన్నుసన్నల్లోనే ఈ అక్రమ మద్యం రవాణా వ్యవహారం కొనసాగుతోందన్న విమర్శలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
సేకరణ: ఈ స్టోరీ అక్టరం తెలుగు దినపత్రిక నుండి తీసుకోవడం జరిగింది!
- Stone Rain రాళ్ల వర్షం కురిసింది ఎక్కడో తెలుసా!(వీడియో)
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి