Political story: తెలంగాణలో పాదయాత్రల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ నేత, హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తుండగానే ఇంకొందరు నేతలు పాదయాత్రలకు సిద్ధమవుతుంది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరణం తర్వా త ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.రాజశేఖర్ రెడ్డి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు.
ఆ తర్వాత 2014 సంవత్సరంలో వైసీపీ ఏపీలో చురుగ్గా మారింది. ఇక 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చే మందు పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు నాయుడు కూడా గతంలో పాదయాత్ర చేశారు. ఈ నెల 24 నుంచి తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు.
నెల రోజుల క్రితం వైయస్ఆర్ టిపి పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2021 అక్టోబర్ 18వ తేదీ నుంచి ఆమె పాదయాత్ర చేపట్టబోతున్నారని సమాచారం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, రాజన్న రాజ్యం తిరిగి తెలంగాణలో తీసుకు వస్తామని వైఎస్ షర్మిల అంటున్నారు.
అక్టోబర్ 18 నుంచి ప్రారంభించబోయే సుదీర్ఘ యాత్రలో అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తారు, ఎలాంటి పాలన అందిస్తారు, తదితర విషయాలను ఈ యాత్రలో ప్రజలకు వివరిస్తారని సమాచారం. 2021 అక్టోబర్ 18న చేవెళ్ల నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం.