Telangana news today

Telangana news today: జైలుకు పోటానికైనా సిద్ధ‌మే..! కానీ ఈ పోరాటం మాత్రం ఆగ‌దు!

Spread the love

Telangana news today: హైద‌రాబాద్‌: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై ఓ వ్య‌క్తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు గురువారం చిల‌క‌ల‌గూడ పోలీసుస్టేష‌న్ కు ఈ ఉద‌యం హాజ‌ర‌య్యారు. సుమారు 4-5 గంట‌ల పాటు తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఇంట్రాగేష‌న్ చేసిన‌ట్టు తెలుస్తోంది. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ప‌లు కీల‌క ప్ర‌శ్న‌లను అడిగిన‌ట్టు స‌మాచారం. అనంత‌రం తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మీడితో మాట్లాడారు.

జైలుకు పోటానికైనా సిద్ధ‌మే..! కానీ ఈ పోరాటం మాత్రం ఆగ‌దు!

తీన్మార్ మ‌ల్ల‌న్న మాట్లాడుతూ ఏప్రిల్ నెల‌లో ఒక‌రు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఈ నెల‌లో త‌న‌ను పోలీసులు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అన‌డంలో ఏదో రాజ‌కీయ కుట్ర దాగి ఉంద‌ని అన్నారు. గ‌త రెండ్రోల కింద‌ట అర్థ‌రాత్రి క్యూ న్యూస్ కార్యాల‌యానికి వ‌చ్చి వంద‌ల మంది పోలీసులు హంగామా చేశార‌ని, నోటీసు స‌ర్వ్ చేశార‌ని అన్నారు. గురువారం పోలీసుల వారి ఆదేశాల మేర‌కు చిల‌క‌ల‌గూడ పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చాన‌ని, పోలీసుల విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రించాన‌ని అన్నారు. త‌న‌ను అన్యాయంగా అరెస్టు చేసి ఇబ్బందుల‌కు గురి చేయాల‌ని చూస్తున్నార‌ని పేర్కొన్నారు. కేసు ఏమిటో తెలియ‌ద‌ని.. కానీ త‌న‌ను 4 గంట‌ల పాటు కూర్చోబెట్టి ఏక‌దాటిగా త‌న‌పై పోలీసు అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించార‌ని అన్నారు. ఒక ప్ర‌శ్న త‌న‌ను అడ‌గ‌డం మ‌రో ప్ర‌శ్న‌కు పోలీసు అధికారికి పై నుంచి ఫోన్ రావ‌డం ఇలా గంట‌ల పాటు త‌న‌ను ప‌లు ప్ర‌శ్న‌ల‌తో విచారించార‌ని అన్నారు.

Telangana news today: విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌

సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్ర‌లో ఇది ఒక భాగ‌మేన‌ని, త‌న‌ను ఏం చేయాలేర‌ని అన్నారు. భార‌త రాజ్యాంగం స్ఫూర్తిగా ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటూ పోరాటం చేస్తుంటే ఈ బాతాల పోశెట్టి త‌నను పోలీసుల ద్వారా ఇబ్బందుల‌కు గురిచేయాల‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. త‌న‌పై చూపించే ఇంట్ర‌స్ట్‌ను ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చూపిస్తే బాగుంటుంద‌ని హిత‌బోధ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా నేను ప్ర‌శ్నించ‌డం మాత్రం ఆప‌బోన‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే జైలుకు అయినా వెళ‌తా కానీ, పోరాటం మాత్రం ఆగ‌బోద‌ని గంభీర స్వ‌రంతో తెలిపారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని త‌న‌పై ఒత్తిళ్లు, ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని, కానీ భ‌విష్య‌త్తులో ఇదే పోలీసుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌నంలో ఉన్న కేసీఆర్‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చే కార్య‌క్ర‌మం త్వ‌ర‌లోనే ఉంద‌ని మీడియా ఎదుట తెలిపారు. త‌న‌ను ఇంత ఇబ్బందుల‌కు గురిచేస్తున్న ప్ర‌భుత్వానికి భ‌విష్య‌త్తులో వ‌డ్డీ, చ‌క్ర‌వ‌డ్డీతో స‌హా తేల్చుకుంటాన‌ని శ‌బ‌థం చేశారు. ఇంకా త‌న‌పై విచార‌ణ ఆగ‌లేద‌ని ఈ నెల 8వ తేదీన మ‌రోసారి ఉద‌యాన్నే విచారణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసు వారు పేర్కొన్నార‌ని, త‌ప్ప‌కుండా పోలీసు వారికి స‌హ‌క‌రిస్తాన‌ని తెలిపారు.

Astrologist Lakshmi Kanth Sharma Vs Teenmar Mallanna | తీన్మార్ మ‌ల్ల‌న్న‌ చేతికి మోస‌పోయిన బాధితుల చిట్టా!

Astrologist Lakshmi Kanth Sharma Vs Teenmar Mallanna | తీన్మార్ మ‌ల్ల‌న్న‌ చేతికి మోస‌పోయిన బాధితుల చిట్టా! Astrologist : తెలుగు రాష్ట్రాల్లో చిన్న వ‌య‌స్సులోనే Read more

teenmaar mallanna: నిరుపేద త‌ల్లి క‌ల‌ను నెర‌వేర్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌|గృహ ప్ర‌వేశం చేసిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌

teenmaar mallanna: నిరుపేద త‌ల్లి క‌ల‌ను నెర‌వేర్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌|గృహ ప్ర‌వేశం చేసిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌Hyderabad: తెలంగాణ బిడ్డ..ప్ర‌జ‌ల త‌ర‌పున దెబ్బ‌లాడే గొంతుక‌.. అన్యాయాన్ని నిగ్గ‌దీసే ద‌మ్మున్నజ‌ర్న‌లిస్టు, Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. Read more

Leave a Comment

Your email address will not be published.