Telangana news ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన దేశ ప్రధాని నరేంద్రమోడీ పై రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు రాసుకున్నాయని చెప్పవచ్చు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసనలతో పాటు మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నరేంద్రమోడీ వ్యాఖ్యలను(Telangana news) ఖండించారు.
టిఆర్ఎస్(TRS) ఆధ్వర్యంలో
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు ఖమ్మం జిల్ల కేంద్రంలో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. నల్లజెండాలను ధరించి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మోటర్ సైకిల్స్‌పై పార్టీ కార్యాలయం నుండి గట్టయ్య సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్, జడ్పీ సెంటర్, వైరా రోడ్, పాత బస్టాండ్ సెంటర్, మున్సిపల్ రోడ్, కస్బా బజార్, అద్దంకి వారి వీధి, చర్చి కాంపౌండ్, బోనకల్ క్రాస్ రోడ్, తుమ్మలగడ్డ, జమ్మిబండ నుడి జడ్పీ సెంటర్‌కు చేరుకుని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్(congress) ఆధ్వర్యంలో
ఇక హైదరాబాద్‌లోనూ గాంధీ భవన్ వద్ద నరేంద్ర మోడి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలో దేశ ప్రధాని కాంగ్రెస్ పార్టీపైన బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల జీవితాలు యువకుల జీవితాలు బాగుంటాయని సంకల్పంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేతకాని పాలన వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. దీనిని అదునుగా తీసుకున్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో మహిళా విభాగం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకుడు ఎండి ముస్తఫా పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ