Telangana New Secretariat: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అంశాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ (Telangana New Secretariat) కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా.బిఆర్.అంబేదర్క్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం అని సీఎం కేసీఆర్ అన్నారు.ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రబుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతుందన్నారు.
స్వయం పాలనలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నతి స్థాయిలో నిలుపుతూ రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనుక బిఆర్.అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నాయన్నారు. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపర్చడం వల్లనే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పటైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా తెలంగాణ ప్రభుత్వం మానవీయ పాలన అందిస్తుందన్నారు.


Telangana New Secretariat: పార్లమెంట్‌కూ పెట్టాల్సిందే!
భారత నూతన పార్లమెంట్ భవానికి కూడా డా.అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు.ఈ క్రమంలో దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే రాజ్యాంగ నిర్మాతను మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సంబంధిత తీర్మాన్నాన్ని అసెంబ్లీ (Telangana New Secretariat) ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇదే విషయమై భారత ప్రధానికి త్వరలో స్వయంగా లేఖను రాసి పంపుతానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా.బిఆర్.అంబేద్కర్ పేరును పెట్టాలని మరోసారి కేంత్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని కేసీఆర్ అన్నారు.